‘టెంపర్’: 2 వారాల్లో 60 కోట్లు వసూలు చేస్తుంది
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం రెండు వారాల్లో రూ. 60 కోట్లు వసూలు చేస్తుందని హీరో, నిర్మాత సచిన్ జోషి జోష్యం చెప్పారు. ‘టెంపర్ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 42 కోట్ల వరకు రాబట్టింది. రెండు వారాలు పూర్తయ్యే నాటికి వసూళ్లు రూ. 60 కోట్లు దాటుతాయి' అంటూ సచిన్ జోషి పేర్కొన్నారు.
అయితే సచిన్ జోషి చెప్పిన విషయం అభిమానులు, ట్రేడ్ విశ్లేషకులు అయోమయానికి గురవుతున్నారు. అతను చెబుతున్న వివరాలు గ్రాస్ కలెక్షన్స్ గురించి, షేర్ గురించా? అనేది అర్థం కావడం లేదు. టెంపర్ చిత్రానికి ఇప్పటి వరకు 42 కోట్ల షేర్ వచ్చినట్లయితే సమాచారం లేదు. బహుషా ఆయన చెప్పేది గ్రాస్ కలెక్షన్ గురించి అయి ఉంటుందని భావిస్తున్నారు. గ్రాస్ కలెక్షన్ అంటే.....టిక్కెట్ల అమ్మం ద్వారా వచ్చే మొత్తం. థియేటర్ల రెంటు, నిర్వహణ ఖర్చులు, ప్రకటనల ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని షేర్ అంటారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
కాగా...‘టెంపర్' చిత్రాన్ని సచిన్ జోషి హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అసలు అలాంటి పవర్ ఫుల్ పాత్రకు అతను సెట్ కాడనే విమర్శలు సైతం వచ్చాయి. దీంతో వెంటన స్పందించిన సచిన్ జోషి....‘నేను టెంపర్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తాను. అంతే కానీ అందులో నటించడం లేదు' అని స్పష్టం చేసాడు.
ఎన్టీఆర్, కాజల్, ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.'


Click it and Unblock the Notifications











