twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లోకనాయకుడుకు టాలీవుడ్ సన్మానం

    By Staff
    |

    తెలుగులో కమల్ సుమారు 15 చిత్రాల్లో నటించినప్పటికీ దాదాపు అన్నీ హిట్టే. 'సాగర సంగమం','స్వాతిముత్యం', 'ఇంద్రుడు చంద్రుడు' చిత్రాలకు ఉత్తమ నటుడుగా నంది అవార్డులు అందుకున్నారు. చివరిసారిగా కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన'శుభసంకల్పం' చిత్రంలో నటించారు. కమల్ పై ఉన్న విశేషాభిమానాన్ని చాటుకుంటూ ఆయనను ఘనంగా సన్మానించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ సన్నాహాలు చేస్తోంది. తమిళ పరిశ్రమ సైతం కమల్ పై తమ అభిమానం చాటుకుంటూ చెన్నై ఆల్వార్ పేటలోని ఎల్డామ్ రోడ్డుకు కమల్ పేరు మార్చేందుకు ప్రభుత్వాన్ని సంప్రదిస్తోంది. ఈనెల 12న ఆయనను చెన్నైలో తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులంతా ఘనంగా సన్మానించనున్నారు. దానికి రెండు రోజుల ముందే తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనను సన్మానించుకుంటూ తమ అభిమానాన్ని చాటుకోనుంది.

    పద్మశ్రీ కమల్ హాసన్ కు నటుడిగా ఇది గోల్డెన్ జూబ్లీ ఇయర్. ఐదేళ్ల ప్రాయంలోనే 'కళత్తూర్ కణ్ణమ్మ' చిత్రంతో బాలనటుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి తొలిచిత్రంతోనే జాతీయ అవార్డు అందుకున్నారాయన. 1959 ఆగస్టు 12న మొదలైన ఆయన నట ప్రస్థానం 50 ఏళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర్ణోత్సవ శుభవేళ ఆయనకు దక్షిణాది పరిశ్రమ నీరాజనాలు పడుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు 162 చిత్రాల్లో నటించి 4 సార్లు జాతీయ అవార్డులు, 18 సార్లు ఫిలిం ఫేర్ అవార్డులను ఆయన అందుకున్నారు. భారత ప్రభుత్వ 'పద్మశ్రీ', చెన్నై సత్యభామ డీమ్డ్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ఆయనను వరించాయి. 'దశావతారం' చిత్రంలో 10 పాత్రలు పోషించడం ద్వారా ప్రపంచ సినీ చరిత్రలోనే అరుదైన రికార్డు సృష్టించి 'లోకనాయకుడు' అనిపించుకున్నారు. స్వర్ణోత్సవ కానుకగా ఆయన నటించిన ద్విభాషా చిత్రం 'ఈనాడు' ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు కూడా వస్తోంది. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడుగా, గాయకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా ఇలా బహుముఖ ప్రజ్ఞావంతుడైన కమల్ ను తెలుగు సినీ పరిశ్రమ ఈనెల 10న ఘనంగా సన్మానించబోతోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X