»   »  ‘1’ నేనొక్కడినే హిందీ వెర్షన్ ట్రైలర్ (వీడియో)

‘1’ నేనొక్కడినే హిందీ వెర్షన్ ట్రైలర్ (వీడియో)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ మహేష్ బాబు కెరీర్ ఎక్కువ ప్రశంసలు పొంది,భాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయిన చిత్రం '1' నేనొక్కడినే . సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఏక్ క దమ్ టైటిల్ తో హిందీలోకి వెళ్తోంది. ఈ చిత్రం ట్రైలర్ నిర్మాతలు విడుదల చేసారు. ఆ ట్రైలర్ ఇదిగో...

  హాలీవుడ్ స్టాండర్డ్స్ లో రూపొందిన ఈ చిత్రం థ్రిల్లర్ జానర్ కి చెందినది. ఈ చిత్రం కథ ఎమోషన్ తో కూడిన రివేంజ్ తో సాగుతుంది. మహేష్ బాబు స్టైలిష్ లుక్ లో రాక్ స్టార్ గా నటించిన చిత్రం '1-నేనొక్కడినే'. మోడల్ కృతిసనన్ హీరోయిన్ గా నటించింది. మహేష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించగా సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఫస్ట్ టైమ్ దేవిశ్రీ ప్రసాద్ మహేష్ సినిమాకు సంగీతం సమకూర్చాడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా క్లాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

  The Trailer of Ek Ka Dum Hindi Version of 1 Nenokkadine

  ఇండస్ట్రీ మొత్తం నుంచి ఈ సినిమాకి బాగా సపోర్ట్ వచ్చింది. ఎన్నో కాల్స్ వచ్చాయి. రవితేజ, రామ్, నాని సహా చాలా మంది హీరోలు, రాజమౌళి, పూరి జగన్నాథ్, సురేందర్‌రెడ్డి సహా చాలా మంది డైరెక్టర్లు, చోటా కె. నాయుడు వంటి టెక్నీషియన్లు సినిమా చాలా బాగుందంటూ ప్రశంసించారు. ప్రస్తుతం జర్మన్, ఫ్రెంచి భాషల్లో డబ్బింగ్ చేసే ప్రక్రియ నడుస్తోంది. ఆ తర్వాత మరికొన్ని ప్రపంచ భాషల్లో డబ్ చేయబోతున్నాల్లో ఉన్నారని తెలుస్తోంది.

  మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషించారు. మహేష్ సరసన కృతి షానన్ నటించిన ఈ చిత్రంలో సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఛాయాగ్రహణం: రత్నవేలు, పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

  <center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/dXdVIXHa0HI?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

  English summary
  Mahesh Babu’s most recent movie Nenokkadine had taken Telugu movies to a new stage all with each other which is an fat which all people confirms to. Being a worldwide appealing subject makers of the movie are going to launch it in Hindi and a lot more languages by dubbing the film. As a 1st stage Nenokkadine will be just before Hindi viewers as “Ek Ka Dum-1″ and its intro, release date will be released shortly.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more