twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడే షామిలీ మొదలెట్టిందా?

    By Staff
    |

    Shamili
    సిద్దార్ధ సరసన ఓయ్ చిత్రంతో షామిలీ హీరోయిన్ గా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. అయితే అప్పుడే సీనియర్ హీరోయిన్లా ఆమె బిహేవియర్ ఉంటోందని, ఆమె తండ్రి సైతం ఇబ్బందిపెడ్తున్నాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. నిన్న వైజాగ్ లో షూటింగ్ జరుగుతుండగా ఆమె తండ్రి హఠాత్తుగా షూటింగ్ పేకప్ చెప్పి ఆమెను తీసుకెళ్లిపోయాడు. ఈ రోజు రాత్రి షూటింగ్ ప్లాన్ చేసుకున్న దర్శకుడు ఆనంద్ అవాక్కయ్యారు. నిర్మాత దానయ్య మొదట అనుకున్న ప్రకారం ఆమెకి ఇరవై లక్షలు ఇవ్వాలి. దాన్ని మొదటి పేమెంట్లోనే క్లియర్ చేసారు.

    అయితే ఆమె తండ్రి ఇంకా ఎక్కువ కావాలని డిమాండ్ చేస్తున్నాడు. దానికి కారణం ఆమెకు హీరోయిన్ గా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే పరిశ్రమనుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇక ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలని దర్శక, నిర్మాతలు తలపట్టుకుకూర్చున్నారు. ఇలా అయితే ఆమె కెరీర్ పెద్దగా ముందుకు వెళ్ళకపోవచ్చునని కామెంట్స్ వినపడుతున్నాయి. చిన్నప్పుడే నేషనల్ అవార్డు పొందిన షామిలీ కి వెండితెర, నిర్మాత, దర్శకులు కొత్త కావచ్చును గానీ ఇప్పుడు హీరోయిన్ గా స్టేచర్ పెర్గింది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X