మన సినీ ప్రముఖులు రాసిన వంటల పుస్తకం
ముంబై : సాధారణంగా ఒక సెలెబ్రిటీ పుస్తకం రాసినా సరే, అది విశేషమే. అలాంటిది యాభై మంది బాలీవుడ్ సిని ప్రముఖులంతా కలిసి ఒక పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకంలో ఏం ఉంటాయంటే... వంటింటి కిటుకులూ, వెరైటీ వంటలూ. అలాగే ఈ పుస్తకానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. మాంసాహారం, డెయిరీ ఉత్పత్తులతో చేసిన పదార్థాలు ఇందులో లేవు. నూనె కూడా ఉపయోగించకుండా చేసిన వంటకాలివి.
హేమమాలిని, సోనమ్‌కపూర్, సోనాక్షీ సిన్హా, విద్యాబాలన్, యానా గుప్తా... వంటి యాభై మంది సినీ ప్రముఖులు అందించిన వంటింటి విశేషాలతో రూపొందిన పుస్తకానికి 'ది వేగాన్ కిచెన్' అని పేరు పెట్టారు. ఈ పుస్తకం కోసం దిలీప్‌కుమార్, అనుపమ్‌ఖేర్, మహేశ్ భట్ వంటి వారూ వంటలు అందించడం విశేషం.
'శాకాహారం ఎంతో మంచిది . గుండె జబ్బులూ, మధుమేహం, వూబకాయం వంటి సమస్యలు దూరంగా ఉంటాయి. అందుకు నాకొచ్చిన శాకాహార వంటల్ని దానిలో పరిచయం చేశాను' అంది యానాగుప్తా. ఈ పుస్తకానికి ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ వచ్చింది. వంటల గురించి తెలుసుకోవటమే కాక...తాము అభిమానించే వారు ఏ తరహా వంటలు అభిమానిస్తారో తెలుసుకోవచ్చనేది ఫ్యాన్స్ మాట.


Click it and Unblock the Notifications












