విజన్ ఆఫ్ భరత్‌ రివ్యూ: భయం, బాధ్యత అంటూ.. డైలాగ్స్‌తో అదరగొట్టిన ప్రిన్స్

By Rajababu

Recommended Video

The Vision Of Bharat Teaser | Bharath Ane Nenu విజన్ ఆఫ్ భరత్‌

ఊహించినట్టుగానే మహేష్‌బాబు నటించిన భరత్ అను నేను చిత్రానికి సంబంధించిన విజన్ ఆఫ్ భరత్ ఆలోచింప జేసేలా ఉంది. విజన్ ఆఫ్ భరత్‌లో ప్రిన్స్ చూపించిన హావభావాలు భావోద్వేగంగా సాగాయి. మహేష్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. వెరసి విజన్ ఆఫ్ భరత్‌తో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. కమర్షియల్ అంశాలతోపాటు సోషల్ మెసేజ్‌తో భరత్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

 మాట తప్పితే మనిషివే కాదు

మాట తప్పితే మనిషివే కాదు

చిన్నప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే నిన్ను మనిషి అని పిలువడానికి అనర్హుడివి అని. ఎప్పటికీ ఆ మాట తప్పలేదు. మర్చిపోలేదు అంటూ విజన్ ఆఫ్ భరత్ ప్రారంభమవుతుంది.

 జీవితంలో అతిపెద్ద ప్రామిస్

జీవితంలో అతిపెద్ద ప్రామిస్

‘నా జీవితంలో అతి పెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు వచ్చింది. పెద్దదే కాదు. అతి కష్టమైనది కూడా. భరత్ అను నేను..' అని మహేష్ ప్రమాణ స్వీకారం చేసే సన్నివేశం చాలా బాగున్నది.

మనమంతా సమాజంలోనే..

మనమంతా సమాజంలోనే..

ఎంత కష్టమైనా అమ్మకు ఇచ్చిన మాట తప్పలేదు. అందుకే నేను మనిషిని. మనం సమాజంలో బతుకుతున్నాం. ప్రతీ ఒక్కరికి భయం, భాద్యత ఉండాలి. ప్రామిస్ అని దిక్కులు పిక్కటిల్లేలా ఓ సందేశాన్ని మహేష్ ఇచ్చారు.

భరత్ రామ్ ముఖ్యమంత్రిగా

భరత్ రామ్ ముఖ్యమంత్రిగా

చివరగా భరత్ రామ్ ముఖ్యమంత్రి అనే నేమ్‌ప్లేట్‌ను జరపడంతో విజన్ ఆఫ్ భరత్ ముగస్తుంది. ఈ ట్రైలర్‌లో మహేష్ పలురకాల గెటప్స్‌లో అలరించాడు.

 మరింత గ్లామర్‌తో ప్రిన్స్ మహేష్

మరింత గ్లామర్‌తో ప్రిన్స్ మహేష్

భరత్ పాత్రలో ఒదిగిపోయినట్టు మహేష్ కనిపించాడు. ఈ చిత్రంలో మరింత గ్లామర్‌గా ప్రిన్స్ కనిపించాడు. ఫైట్స్ కంపోజింగ్ కూడా అదరగొట్టేలా కనిపించాయి. సామాజిక సందేశం మాటున ఓ కమర్షియల్ పంథాను దర్శకుడు కొరటాల శివ కొనసాగించినట్టు కనిపించాడు.

దేవీ శ్రీ ప్రసాద్ ట్వీట్ ఇలా

మీకోసం విజన్ ఆఫ్ భరత్ షేర్ చేస్తున్నాను. మీరందరూ చాలా ఇష్టపడటం ఖాయం. ప్రిన్స్, కొరటాల టెర్రిఫిక్‌గా ట్రైలర్‌ను మలిచారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి అని దేవీ శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు.

రోమాలు నిక్కబొడిచాయని అనిల్ రావిపూడి

వావ్?. సూపర్బ్.. రోమాలు నిక్కబొడిచాయి. ప్రామిస్ గట్టిగా కొడుతారు. ఆల్‌ ది బెస్ట్ ప్రిన్స్ మహేష్, కొరటాల శివ, టీమ్ సభ్యులందరికీ.. అని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.

దండాలతో వెన్నెల కిషోర్

సూపర్‌స్టార్ బాధ్యతలను స్వీకరించారు. దండలయ్యా మీకు అంటూ వెన్నెల కిషోర్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X