Rana Daggubati Look of Virata Parvam.. ప్రజలు బిగించిన పిడికిలి రవన్న.. ఛలో పరిగెత్తు ఛలో పరిగెత్తు.. గూంజ్ బం

వేణు ఊడుగుల దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో దగ్గుబాటి రానా నటిస్తున్న తాజా చిత్రం విరాట పర్వం. ఎప్పుడో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతోంది. అయితే దగ్గుబాటి రానా పుట్టిన రోజు నేపథ్యంలో ఈ సినిమా నుంచి 'ది వాయిస్ ఆఫ్ రవన్న' అంటూ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా

య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా

హీరో రానా దగ్గుబాటి పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'విరాటపర్వం'లో క్రామేడ్‌ రవన్న కు సంబందించిన 'ది వాయిస్ ఆఫ్ రవన్న' అంటూ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. నీది నాది ఒకే కధ దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో 1990వ ద‌శ‌కంలో ఉత్త‌ర తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

ఛలో పరిగెత్తు ఛలో పరిగెత్తు

ఛలో పరిగెత్తు ఛలో పరిగెత్తు


ఈ విరాటపర్వం సినిమాలో డా. రవి శంకర్‌ అలియాస్‌ న‌క్స‌లైట్ నాయ‌కుడు కామ్రేడ్‌ రవన్నగా రానా తన విశ్వరూపాన్ని మరోసారి ప్రదర్శించనున్నాడని తాజాగా విడుదల చేసిన వీడియో చూస్తే అర్ధం అవుతుంది. ఛలో పరిగెత్తు ఛలో పరిగెత్తు అంటూ విప్లవం తో కూడిన ఒక నిమిషం వీడియో సినిమా మీద అంచనాలను అంతకంతకూ పెంచేస్తోంది.

విడుదలకు సిద్ధమవుతోంది

విడుదలకు సిద్ధమవుతోంది

ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో కామ్రేడ్ భారతక్క పాత్రలో ప్రియమణి కనిపించనున్నారు. నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావ్‌, సాయిచంద్‌, బెనర్జీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తి కాగా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

కవితలు చదివి అభిమానిగా


డి. సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ మూవీపై అంచనాలను పెంచేశాయి. యదార్ధ సంఘటనల ఆధారంగా 1990'ల నాటి విప్లవ కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో అభ్యుదయ భావాలూ కలిగిన యువకుడిగా రానా అద్భుతంగా నటించారు. ఆయన కవితలు చదివి అభిమానిగా మారి అతని ప్రేమ కోసం వెతుకుతూ వెళ్లి చిక్కుల్లో పడ్డ యువతిగా సాయిపల్లవి కనిపిస్తుందని చెబుతున్నారు.

 సినిమాల విషయానికి వస్తే

సినిమాల విషయానికి వస్తే

ఇక రానా నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆ మధ్య అరణ్య అనే సినిమాతో వచ్చారు. ఈ సినిమాలో అడవి, అడవి జంతువుల నేపథ్యంలో వాటి హక్కులు రక్షణ గురించి చర్చించారు. ఇక ఆయన విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఇది కాక పవన్ తో భీమ్లా నాయక్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో పాటు విశ్వశాంతి పిక్చర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి ఆయన అంగీకరించారని అంటున్నారు. ఇక ఆయన నటించిన 1945 సినిమా డిసెంబర్ 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X