twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రతి కుక్కను కంట్రోల్ చేయలేం, గెలుపే మన రివేంజ్: నాగబాబు

    మెగా అభిమానుల ఇష్యూపై నాగబాబు స్పందించారు. అనవసర విషయాలపై స్పందించ వద్దని తెలిపారు.

    By Bojja Kumar
    |

    Recommended Video

    Nagababu Preached To Mega Fans

    మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. మనకు నచ్చని అంశాలు కనబడకూడదు, వినపడకూడదు అంటే కుదరదు. మనం ఒక ప్రపంచంలో నివసిస్తున్నపుడు మనకు ఇష్టం లేనివి ఎన్నో జరుగుతుంటాయి..... ఇష్టం లేనివి జరుగకూడదు అనుకోవడం లోనే ఒక కష్టం ఉంది అని నాగబాబు అన్నారు.

    ఈ ప్రపంచంలో మనకు ఇష్టం లేనివి జరుగుతుంటాయి. మనకు నచ్చనివి జరుగుతుంటాయి. జరిగేది జరుగుతుంది. దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో అలా అవుతాం. జరుగకూడదు అనుకోవడానికి ఈ ప్రపంచం మన ఒక్కరిదే కాదు, ఎన్నో కోట్ల జీవరాసుల సమాహారం అని నాగబాబు వ్యాఖ్యానించారు.

    కుక్క అరవడం ఇష్టం ఉండదు

    కుక్క అరవడం ఇష్టం ఉండదు

    నాకు రోడ్డు మీద వెలుతుంటే కుక్క అరవడం ఇష్టం ఉండదు. అది అరిస్తే చిరాకు. కానీ దాన్ని మనం ఎక్కడ కంట్రోల్ చేయగలం, బోలెడన్ని పనికిమాలిన కుక్కలు అరుస్తుంటాయి, ప్రతి కుక్కను నేను ఎక్కడ కంట్రోల్ చేయగలను. అరిచే ప్రతి గాడిదను మనం కంట్రోల్ చేయలేం. మనకు ఇష్టం లేనివి వంద జరుగుతుంటాయి అని నాగబాబు అన్నారు.

    ఎలా ఎదగాలి అనేదానిపైనే దృష్టి

    ఎలా ఎదగాలి అనేదానిపైనే దృష్టి

    వాటిని పట్టించుకోకుండా నేను ఏం పని చేయాలి, ఎలా పైకి రావాలి, ఎలా అభివృద్ది చెందాలనేదానిపై దృష్టి పెడతాను. పాజిటివ్‌గా థింక్ చేస్తాను. అలాంటివేమీ పట్టించుకోను. నా మాటలు మీరు ఎలా తీసుకున్నా ఫర్వా లేదు.... అని నాగబాబు అన్నారు.

    నాన్నగారు బ్రతికుండటం ఇష్టం

    నాన్నగారు బ్రతికుండటం ఇష్టం

    మా నాన్న గారు బ్రతికుండటం నాకు చాలా ఇష్టం. ఆయన చనిపోయారు. భరించాం, బాధను దిగమింగుకున్నాం, మామూలుగా బ్రతికేస్తున్నాం. ఈవిధంగా నేను ఆలోచిస్తాను. అలాగే మాకు ఇష్టం లేకుండా బోలెడు జరుగుతుంటాయి... అని నాగబాబు అన్నారు.

    మెగా ఫ్యాన్స్ వీరంగం అనే ఇష్యూపై

    మెగా ఫ్యాన్స్ వీరంగం అనే ఇష్యూపై

    ఈ మధ్య మెగా ఫ్యాన్స్ వీరంగం అని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చపై నాగబాబు స్పందిస్తూ.... వాక్ స్వాతంత్రం ఉంది కాదా అని మనం మాట్లాడితే తప్పులేదు, అలా మాట్లాడేవాళ్లు ఎవరైనా సరే... వారి మాటల వల్ల వచ్చే రెసిస్టెన్స్‌‌కు కూడా సిద్ధంగా ఉండాలి అన్నారు.

    వాక్ స్వాతంత్రం అందరికీ ఉంటుంది

    వాక్ స్వాతంత్రం అందరికీ ఉంటుంది

    వాక్ స్వాత్వంత్రం ఒక్కరికే ఉండదు, అందరికీ ఉంటుంది. ఒక్కొక్కరు ఒకలా రియాక్ట్ అవుతారు. ఒక తెలివిగలవాడు ఒకలా, ఒక ఆవేశపరుడు ఒకలా, ఒక శాంతంగా ఉండేవాడు ఒకలా, ఒక జ్ఞాని, ఒక ఆలోచనా పరుడు, పామరుడు రకరకాలుగా రియాక్ట్ అవుతారు అని నాగబాబు అన్నారు.

    ఫ్యాన్స్ అలాంటి పదజాలం వాడి ఉండకూడదు

    ఫ్యాన్స్ అలాంటి పదజాలం వాడి ఉండకూడదు

    మా ఫ్యాన్స్ ఈ మధ్య ఒక చిన్న ఇష్యూలో రియాక్ట్ అయ్యారు. ఎవరైతే వారిని రెచ్చగొట్టారో, వారికి ఎంత స్వాతంత్రం ఉందో.... వీళ్లకు అంతే స్వాతంత్రం ఉంది. కాకపోతే కొందరు ఫ్యాన్స్ వాడిన పదజాలం బెటర్‌గా ఉండాల్సింది. అలాంటి పదజాలం వాడిఉండకూడదు అని నాగబాబు అభిప్రాయ పడ్డారు.

    మెగా ఫ్యామిలీని అడ్డం పెట్టుకుని

    మెగా ఫ్యామిలీని అడ్డం పెట్టుకుని

    ఇలాంటి చిన్న చిన్న విషయాలకు మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీని, పవర్ స్టార్‌ను అడ్డం పెట్టుకుని మాట్లాడే ప్రతిఒక్కరికి మనం సమాధానం చెబుతూ ఉండలేము అని నాగబాబు అన్నారు.

    దానిపై ఫోకస్ పెట్టండి

    దానిపై ఫోకస్ పెట్టండి

    ప్రతి చిన్న, అనవసర విషయాలకు మనం రియాక్ట్ అవ్వడం వేస్ట్. అలాంటి విని ఫ్యూచర్లో కళ్యాణ్ బాబుకు రాజకీయంగా ఎంత చేయాలో దాని మీద ఫోకస్ చేయాలని ఫ్యాన్స్‌కు చెబుతాను అని నాగబాబు అన్నారు.

    అన్నయ్య, తమ్ముడు సాఫ్ట్ టార్గెట్స్

    అన్నయ్య, తమ్ముడు సాఫ్ట్ టార్గెట్స్

    మెగా ఫ్యామిలీలో చిరంజీవిగారు, కళ్యాణ్ బాబు సాఫ్ట్ టార్గెట్స్ అయ్యారు. ఎవ్వడు ఏదైనా అనేయొచ్చు అనుకుంటున్నారు. ఎవడు పడితే వాడు నోటికొచ్చినట్లు మాట్లాడతారు. అది మీడియా అయుండొచ్చు, పర్సనల్ గా అయుండొచ్చు. వ్యక్తులు అయుండొచ్చు. సాఫ్ట్ టార్గెట్స్ కాబట్టి ఏదైనా అంటే మేము ఊరుకుంటాం, ఏమీ అనం... కానీ ఫ్యామిలీని అభిమానించే అభిమానులు అలా ఉండరు కదా.... అని నాగబాబు వ్యాఖ్యానించారు.

    ఫ్యాన్స్ రైట్ గా చేశారు అని నేను అనడం లేదు

    ఫ్యాన్స్ రైట్ గా చేశారు అని నేను అనడం లేదు

    ఫ్యాన్స్ చాలా రైట్ గా చేశారు అనను, వాళ్లలో కొంత మంది వాడిన పదజాలం తేడాగా ఉన్నా... వాళ్ల ఆవేశాన్ని మాత్రం అర్థం చేసుకోగలను. వాళ్లు ఎక్స్‌ప్రెస్ చేసిన బాషలో తప్పు ఉండొచ్చు. కానీ వాళ్ల పెయిన్లో తప్పులేదు. వాళ్లను రిక్వెస్ట్ చేసేది ఒకటే. భాషను కరెక్టుగా వాడండి. కానీ మీ పెయిన్ ను చెప్పండి. తప్పులేదు అందులో. మీకు వాక్ స్వాతంత్రం ఉంది..... అని మాత్రమే చెప్పగలను అని నాగబాబు అన్నారు.

    ఎన్నో ఆటుపోట్లు భరించారు

    ఎన్నో ఆటుపోట్లు భరించారు

    ఎక్కడైనా సరే ఒక సినిమా హీరో, లేదా నాయకుడు బిగినింగులో ఎమర్జ్ అవుతున్నపుడు....... అభిమానులు లేదా సహచరులు హీరో లేదా నాయకుడి మాట వింటారు. వాళ్లు మనల్ని ఇష్టపడుతుంటారు, వాళ్లు ఎంత వరకు వెళతారంటే మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా వారు చూసుకుంటారు. వ్యక్తిగతంగా మంచి పని చేస్తే ఇంకా ప్రేమిమిస్తారు. చిరంజీవిగారు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎన్నో లక్షల మందికి హెల్ప్ అయ్యారు. ఆ వ్యక్తిగత జీవితం మీద ఇష్టపడుతుంటారు. కళ్యాణ్ బాబు నటుడుగాను, సమాజ సేవకుడిగా ఎన్నో చేశారు. రాజకీయంగా పార్టీ పెట్టినా, పోటీ చేయకున్నా సమస్యలపై స్పందిస్తూ సమస్యల మీద పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ప్రశ్నించడంతో పాటు తనకు చేతనైన పరిష్కారం కూడా చేస్తున్నారు. కళ్యాణ్ బాబు నిన్నగాక మొన్న ఫామ్ అయినోడు కాదు
    20 ఏళ్ల నుండి యాక్ట్ చేస్తుంటే ఇప్పటి దాకా వచ్చింది. ఎన్నో ఆటుపోట్లు భరించారు. అలాగే చిరంజీవి గారు కూడా..... అని నాగబాబు అన్నారు.

    అభిమానులకు వాళ్లను మించే శక్తి వస్తుంది

    అభిమానులకు వాళ్లను మించే శక్తి వస్తుంది

    ఈ ఫ్యాన్స్ రాను రాను ఏమవుతారంటే... వాళ్లు ఎవరినైతే అభిమానిస్తారో వాళ్లను మించి పోయే శక్తి వస్తుంది. అపుడు ఫ్యాన్స్ గానీ, అనుచరులుగానీ ఇండివిడ్యువల్ శక్తిగా మారిపోతారు. వీళ్లు చెప్పినట్లే హీరో లేదా నాయకుడు నడుచుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి మీరు గమనిస్తే రాజకీయాల్లో అలానే ఉంటుంది. కార్యకర్తల మనో భావాలు బట్టే నాయకుడు నచుకుంటాడు తప్ప నాయకుడి మనోభావాల మీద కార్యకర్త ఎప్పుడూ నడుచుకోడు. 90 శాతం కార్యక్తలు ఎలా చెబితే అలా చేస్తారు. సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే. అంతా ఫ్యాన్స్ చేతిల్లోకి వెళ్లి పోతుంది. ఎంజీఆర్ ఫ్యాన్స్ ఆయన్ను ఏమైనా అంటే అప్పట్లో చెన్నైలో చాలా వైల్డ్ గా రియాక్ట్ అయిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. అది ఎంజీఆర్ చేతుల్లో లేదు, అలాగే కన్నడ రాజ్ కుమార్ గారు ఎప్పుడూ ఎవరినీ ఏమీ అనరు. చాలా సైలైంట్. ఆయన అభిమానులు చాలా పెద్దవారయ్యారు. ఆయన చనిపోయాక కూడా ఆయన ఫ్యామిలీని ఎవరైనా ఏమైనా అంటే ఎంతకైనా తెగించేస్తారు. అంత స్ట్రాంగ్ ఫ్యాన్స్. అక్కడ రాజ్ కుమార్ ఏమీ అనలేరు, మేము కూడా ఏమీ ఆపలేం. అయితే ఒకటే వారిని రిక్వెస్ట్ చేయగలం. అంత ఆవేశం పనికి కాదు, సంయమనం పాటించండి, మీ శక్తి ఎనర్జీ అన్ని మంచి పని కోసం వెలుతున్న కళ్యాణ్ బాబు కోసం వాడండి, దాని వైపు దృష్టి కేంద్రీకరించగలమని చెప్పగలం తప్ప వాళ్లను ఆర్డర్ చేయలేం... అని నాగబాబు అన్నారు.

    గెలుపే బెస్ట్ రివేంజ్

    గెలుపే బెస్ట్ రివేంజ్

    అభిమానులకు పర్సనల్ గా చెప్పేది ఒకటే. మనల్ని అడ్డం పెట్టుకుని పబ్లిసిటీ సంపాదించుకునే వారు చాలా మంది మంది ఉంటారు. చిన్న విషయాల గురించి మనం పట్టించుకోకూడదు. పట్టించుకుంటే అనవసరంగా ఎనర్జీ ఇచ్చినట్లే. మనల్ని విమర్శించిన వారికి, శత్రువులకు సమాధానం మన గెలుపు. విన్నింగ్ ఈజ్ ది బెస్ట్ రివేంజ్..... అని నాగబాబు అన్నారు.

    English summary
    "The win is the best revenge. It is not right to respond to unnecessary things." Nagababu preached to mega fans.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X