»   » 'బాహుబలి' ప్రదర్శించడం లేదని థియేటర్‌పై రాళ్లదాడి

'బాహుబలి' ప్రదర్శించడం లేదని థియేటర్‌పై రాళ్లదాడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తాజా చిత్రం 'బాహుబలి' . రేపు విడుదల అవుతున్న ఈ చిత్రం యావత్‌ భారతదేశ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు హిందీలోనూ విడుదలవుతోంది. ఈ నేపధ్యంలో టిక్కెట్ల కోసం హంగామా జరుగుతోంది. ముఖ్యంగా విశాఖలో బాహుబలి అభిమానుల హల్‌చల్‌ చేసారు. పూర్తి వివరాల్లోకి వెలితే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


తాజాగా విశాఖలోని శ్రీకన్య థియేటర్ పై అభిమానులు రాళ్లతో దాడి చేశారు. ఆ థియేటర్ లో బాహుబలి చిత్రాన్ని ప్రదర్శించటం లేదంటూ ఆందోళనకు దిగారు. శ్రీకన్య థియేటర్‌పై రాళ్లదాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.


గత రెండు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధిక శాతం సినిమా హాళ్ల హంగామా నడుస్తోంది. కౌంటర్లు తెరచిన అరగంటలోనే టికెట్లు అమ్ముడవడంతో అప్పటి వరకు బారులు తీరిన అభిమానులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. కొందరైతే ఆ నిరాశలో ఇలాంటి పనులుకు పూనుకుంటున్నారు.


Theater attacked for not screening Baahubali

అంతే కాదు... టికెట్లు ముందే అమ్ముకున్నారంటూ థియేటర్ యాజమాన్యాల తీరుకు నిరసనగా కొన్నిచోట్ల అభిమానులు నిరశనలకు సైతం దిగుతున్నారు. కొన్ని చోట్ల థియేటర్లపై దాడికి కూడా దిగుతున్నారు.


హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లోని సినీ మాక్స్‌లో టికెట్లు ముందే అమ్ముకున్నారంటూ బుధవారం అభిమానులు బైఠాయించారు. ఇక ఐమాక్స్ వద్ద తోపులాట చోటుచేసుకుంది. గేటు తీసే సమయంలో పరుగులు పెట్టిన అభిమానుల్లో కొందరు కింద పడిపోయారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.


ఆన్‌లైన్‌లోనూ అదే పరిస్ధితి..... ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేయాలని ప్రయత్నించిన వారికీ నిరాశ తప్పలేదు. దాదాపు అన్ని వెబ్‌సైట్లలోనూ టికెట్లు అమ్ముడైపోయినట్టు కనిపించడంతో అభిమానులు థియేటర్ల వద్దకు పరుగులు తీశారు. అంతేకాదు...ఆన్ లైన్ వ్యాపారం నిర్వహించే వెబ్‌సైట్ల నిర్వాహకులు ప్రేక్షకుల సినిమా పట్ల ఉన్న ఉత్సాహాన్ని, ఆసక్తిని 'క్యాష్' చేసుకోవాలనే ఉద్దేశంతో కావాలనే టికెట్లు అయిపోయినట్టు సైట్లలో చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


Theater attacked for not screening Baahubali

నిన్నటి విషయానికి వస్తే... కూకట్ పల్లి విశ్వనాథ్ థియేటర్ వద్ద ఒకో టికెట్ ను బ్లాక్ లో 2000కు అమ్ముతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.


హైదరాబాద్ లో....


సినిమా విడుదలవుతున్న థియేటర్లు సుమారు నూట యాభై వరకూ ఉంటే... అందులో ఇరవై వరకు మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. మల్టీప్లెక్స్‌లలోని దాదాపు అన్నీ స్క్రీన్‌లలో ఇదే సినిమా ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు.


తెలుగుతో పాటు తమిళం, మళయాలం, హిందీ భాషల్లోనూ రేపు...(జూలై 10) నే విడుదల కానుంది. ఈ సినిమా, దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కావడం, ట్రైలర్, పోస్టర్లు సినిమాపై విపరీతమైన అంచనాలను క్రియేట్ చేసాయి.


Theater attacked for not screening Baahubali

ఈ చిత్రానికి నిన్నటి ఉదయం నుంచే ప్రధాన థియేటర్లలో, మల్టీప్లెక్స్‌లలో టికెట్ బుకింగ్‌ను మొదలుపెట్టేశారు. ఆన్‌లైన్‌లో నిమిషం కూడా టికెట్లు అందుబాటులో లేకుండా అమ్ముడైపోవడం సంచలనమైంది. అలాగే..., మల్టీప్లెక్సుల్లో ఈ సినిమా బుకింగ్స్ కోసం అభిమానులు భారీ సంఖ్యంలో హాజరు అయ్యారు.


ముఖ్యంగా హైద్రాబాద్‌తో పాటు మరికొన్ని ప్రధాన నగరాల్లోని మల్టిప్లెక్సుల్లో టికెట్ల బుకింగ్ మొదలుకాగా, బుకింగ్ కౌంటర్ల వద్ద అభిమానులు బారులు తీరి కనిపించారు. చాలా చోట్ల కిలోమీటర్ మేర క్యూ ఉండడం జరిగింది.


మరో ప్రక్క ముందు రోజు అంటే ఈ రోజు (గురువారం) అర్థరాత్రి ప్రదర్శితమయ్యే బెనిఫిట్ షోలకు కనీవినీ ఎరుగని రీతిలో టిక్కెట్ పెట్టారు. వీటి అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

English summary
Sri Kanya Theater in Vizag was attacked by a mob as its owners refused to yield their request of screening Baahubali movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu