Just In
- 16 min ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 1 hr ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 2 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 3 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- News
చెక్కు చెదరని ప్రధాని నరేంద్ర మోడీ ఛర్మిష్మా: పెద్దపీట వేసిన తెలంగాణ, షాకిచ్చిన పంజాబ్
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Finance
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్యూ 3 ఫలితాల కిక్ : 18% పెరిగిన నికర లాభం
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హిట్ టాక్ ఎఫెక్ట్.....‘పటాస్’ పెంచారు!
హైదరాబాద్: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘పటాస్' చిత్రానికి తొలి రోజు నుండే భారీ హిట్ టాక్ రావడంతో థియేటర్లకు జనం పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్ల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. యూఎస్ మార్కెట్లోనూ ఈచిత్రానికి మంచి స్పందన వస్తోంది. సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ యాక్షన్ ఎంటర్టెనర్ కావడంతో సినిమాకు కలెక్షన్లు ఊహించిన దానికంటే బావున్నాయి.
రచయితగా పలు చిత్రాలకి పనిచేసిన అనీల్ రావిపూడి ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమయ్యారు. సినిమా విడుదలైన మార్నింగ్ షో కే హిట్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ డే కలెక్షన్ నైజాం, ఆంధ్రా షేర్...1.7 కోట్లు రావడం విశేషం. సెకండ్ డే కూడా దాదాపు ఎనభై నుంచి తొంభే శాతం ఫిగర్స్ నమోదు అయ్యాయి. ఈ రేంజిలో కలెక్షన్స్ రావటం కళ్యాణ్ రామ్ కెరిర్ లో రికార్డే.

ఈ చిత్రం విడుదల ముందు ప్రమోషన్స్ నిమిత్తం స్వయంగా కళ్యాణ్ రామ్ తమ్ముడు యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ రంగంలోకి దిగడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మొత్తానికి చాలా కాలం తర్వాత కళ్యాణ్ రామ్ కెరీర్లో భారీ విజయం నమోదు కావడంతో అంతా హ్యాపీగా ఉన్నారు.
శృతి సోడి హీరోయిన్‌గా నటించింది. ఇతర పాత్రల్లో సాయికుమార్, బ్రహ్మానందం, అశుతోష్ రాణా, ఎమ్మెస్ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సర్వేశ్ మురారి, ఎడిటింగ్: తమ్మిరాజు, రచనా సహకారం: ఎస్.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి.