twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    థియేటర్లకు పూర్వ వైభవం: చిత్ర ప్రదర్శనకు సర్వం సిద్ధం

    |

    తెలంగాణాలో ఎట్టకేలకు సినీ ప్రియుల ఎదురుచూపులకు తెరపడబోతోంది. డిసెంబర్ 4 నుంచి సినిమా ప్రదర్శనల నిమిత్తం థియేటర్లను తెరిచేందుకు రంగం సిద్ధమవుతోంది. దీంతో ఇటు సినీ అభిమానులతో పాటూ, చిత్ర పరిశ్రమలోనూ నూతనోత్సాహం తొణికిసలాడుతోంది.

    తెరచుకోనున్న సినిమా హాళ్లు

    తెరచుకోనున్న సినిమా హాళ్లు

    కోవిడ్ 19 నియమ నిబంధనల పాటిస్తూ సినిమా హాళ్లను తెరవవచ్చునని గతంలోనే తెలంగాణా ప్రభుత్వం వెల్లడించిన సంగతి విదితమే. అయితే, థియేటర్ యజమానుల సంఘం పలు దఫాల చర్చలు జరిపి డిసెంబర్ 4 నుంచి థియేటర్లను చిత్ర ప్రదర్శనకు సిద్ధం చేయాలని నిర్ణయించింది.

    చిత్ర ప్రదర్శనకు సర్వం సిద్ధం

    చిత్ర ప్రదర్శనకు సర్వం సిద్ధం

    టికెట్ ధరను తమ పరిస్థితులకు అణుగుణంగా నిర్ణయించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించినప్పటికీ, ధరలను యధాతథంగా కొనసాగించాలనే థియేటర్ల యాజమాన్యం నిర్ణయించుకుంది. ప్రేక్షకుల సౌకర్యం, రక్షణే ప్రస్తుతం తమ ప్రధాన లక్ష్యమని ఎగ్జిబిటర్లు పేర్కొన్నారు.

    ప్రేక్షక స్పందనపై సర్వత్రా ఆసక్తి

    ప్రేక్షక స్పందనపై సర్వత్రా ఆసక్తి

    సినిమాలను విడుదల చేయాలనుకునే నిర్మాతలకు... ప్రచారానికి, బజ్ క్రియేట్ చేయడానికి కాస్త సమయం పడుతుంంది కాబట్టి, ముందు నుంచే హాళ్లను అందుకు సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సానిటైజింగ్ పై థియేటర్లు యాజమాన్య ప్రత్యేక దృష్టి సారించింది.

    Recommended Video

    Middle Class Melodies Team Interview Part 2 | Goparaju Ramana On Theatre Vs Movie
    50శాతం సీటింగ్

    50శాతం సీటింగ్

    అయితే ప్రభుత్వం 50శాతం సీటింగ్ కు మాత్రమే అనుమతి ఇవ్వడంతో ప్రేక్షకులు నుంచి ఏ విధమైన స్పందన లభిస్తుందన్నదానిపై ఎగ్జిబిటర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆడియన్స్ రెస్పాన్స్ బట్టే రోజుకు ఎన్ని షోలు వేయాలన్నదానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఏమైనా కలెక్షన్ల ఆధారంగానే ఎగ్జిబిటర్లు, నిర్మాతల భవిష్యత్తు ఆధారపడి ఉండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

    English summary
    Theatres to reopen in Telangana as the exibitors to start screening from december 4th. Producers all set to gear up for the releases as audience are exited.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X