twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా థియేటర్ల బంద్ సమాప్తం: చాలా తప్పులు చేశామన్న సురేష్ బాబు!

    By Bojja Kumar
    |

    గత వారం రోజులుగా కొనసాగుతున్న సినిమా థియేటర్ల బంద్ ముగిసింది. శుక్రవారం(మార్చి 9) నుండి తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు ప్రదర్శించనున్నారు. అటు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు, సినిమా ఇండస్ట్రీ మధ్య తాత్కాలిక ఒప్పందం కుదరడంతో ప్రస్తుతానికి బంద్‌కు 'శుభంకార్డు' వేశారు.

     సమస్య తాత్కాలికంగా పరిష్కారమైంది అన్న సురేష్ బాబు

    సమస్య తాత్కాలికంగా పరిష్కారమైంది అన్న సురేష్ బాబు

    కొన్ని నెలలుగా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు, ఇండస్ట్రీకి మధ్య చర్చలు జరుగుతున్నాయి. వారు దిగిరావాలనే ఈ నెల 2 నుండి సినిమా థియేటర్లు మూసి వేశాం. ప్రస్తుతానికి తాత్కాలిక సొల్యూషన్ మాత్రమే లభించింది. 9వ తేదీ నుండి తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు స్క్రీన్ అవుతాయి... అని సురేష్ బాబు తెలిపారు.

     ఇంకా చాలా కోరికలు ఉన్నాయి

    ఇంకా చాలా కోరికలు ఉన్నాయి

    తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వారి సెక్టర్ కౌన్సిల్ నుండి తాత్కాలిక సొల్యూషన్ ప్రపోజల్‌ను యాక్సెప్ట్ చేశారు. వారికి ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికల వివరాలు కూడా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు పంపించడం జరిగింది. వాటిని కూడా ఎంత తొందరగా సాల్వ్ చేయగలిగితే అంత తొంతరగా సాల్వ్ చేయాలని రిక్వెస్ట్ చేశాం... అని సురేష్ బాబు తెలిపారు.

    ఆ రెండు సంస్థలు మెర్జ్ కాబోతున్నాయి, ఆ తర్వాత మళ్లీ చర్చలు

    ఆ రెండు సంస్థలు మెర్జ్ కాబోతున్నాయి, ఆ తర్వాత మళ్లీ చర్చలు

    క్యూబ్, యూఎఫ్ఓలు రెండు మూడు నెలల్లో మెర్జ్ కాబోతున్నాయి. ఆ తర్వాత మళ్లీ డిస్క్రషన్స్ జరుగుతాయి. ఆపుడు మా డిమాండ్లు మరిన్ని సాధించుకోగలుతాం. ఇపుడు ఈ అగ్రిమెంటు యూఎఫ్ఓ, క్యూబ్ రెండు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో చేసుకున్నాం. ఈ ఒప్పందంపై తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంతకం పెట్టారు... అని సురేష్ బాబు తెలిపారు.

     ఆ చిన్న తప్పులే ఇపుడు పెద్దగా అయ్యాయి

    ఆ చిన్న తప్పులే ఇపుడు పెద్దగా అయ్యాయి

    మాకు, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ మధ్య చాలా సంవత్సరాలుగా సమస్య ఉంది. ఈ వ్యవస్థ పెట్టే విధానంలోనే తప్పు జరిగిపోయింది. పది పదిహేను సంవత్సరాల ముందే ఈ వ్యవస్థ మొదలైంది. వారి సైడ్ నుండి, మా సైడ్ నుండి, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరం చిన్న చిన్న తప్పులు చేశాం. ఒక వ్యాపారం చేసినపుడు తప్పులు జరుగడం సహజం. కానీ ఆ చిన్న తప్పులే ఇపుడు చాలా పెద్దవి అయ్యాయి.... అని సురేష్ బాబు తెలిపారు.

    అందుకే బంద్ చేశాం

    అందుకే బంద్ చేశాం

    మూడు నాలుగు సంవత్సరాలుగా చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాం. అన్ని వైపుల నుండి ఇరిటేషన్స్, ప్రాబ్లమ్స్ ఉండటంతో అంతా కలిసి మీటింగ్స్ పెట్టుకున్నాం. అవి తొలి నాళ్లలో సరిగా జరుగలేదు. వారు మీటింగులకు రాక పోవడం, వారు ఒప్పుకున్న కొన్నింటిని సరిగా అమలు పరచక పోవడం, ఇవన్నీ జరుగడం వల్ల అందరూ అసంతృప్తిలో ఉన్నారు. అందుకే మేము సినిమాలు బంద్ చేయాల్సినంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మాకు ఎవరికీ ఏ రోజూ సినిమా షూటింగులు ఆపాలని కానీ, థియేటర్లు బంద్ చేయాలని కానీ కోరిక ఉండదు... అని సురేష్ బాబు తెలిపారు.

     మా కోరికలు అన్నీ తీరిస్తే వారు కంపెనీలు మూసుకోవాలి

    మా కోరికలు అన్నీ తీరిస్తే వారు కంపెనీలు మూసుకోవాలి

    దురదృష్ట వశాత్తు కొన్ని పరిస్థితుల వల్ల బంద్ చేయాల్సి వచ్చింది. మేము సీరియస్ గా బంద్ చేయడం వల్ల వారు కూడా వచ్చి మాట్లాడారు. వారికి ఉన్న ఇబ్బందులు కూడా మాకు చెప్పారు. మేం వారి సమస్యలు అర్థం చేసుకున్నాం, మా సమస్యలు వారు అర్థం చేసుకున్నారు. మాకు చాలా కోరికలు ఉన్నాయి. మా కోరికలన్నీ తీరిస్తే కంపెనీలు మూసుకోవాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. మేము కంపెనీ మూసుకుని వెళ్లమని చెప్పలేం కదా.... అని సురేష్ బాబు వెల్లడించారు.

    English summary
    "Theatres open from March 9th in Telugu states" Producer Suresh Babu Speaks To Media Over Cinema Theatres Bandh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X