డైరర్టర్ గోపీచంద్ మలినేని పెళ్లి రిసెప్షన్ లో చోరీ
హైదరాబాద్: పెళ్లి విందుకు వచ్చిన బంధువుల రెండు సంచులు(నగదు, నగల బ్యాగు) చోరీకి గురైన సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వాటిలో రూ. 1.23 లక్షల నగదు, ఐదున్నర తులాల బంగారు ఆభరణాలు, 200 అమెరికన్ డాలర్లు ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సినీదర్శకుడు మలినేని గోపీచంద్ పెళ్లి రిసెప్షన్ ఆదివారం రాత్రి మాదాపూర్‌లోని ఆవాస హోటల్‌లో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి గోపీచంద్ బంధువు రాజీవ్‌నగర్‌కు చెందిన అన్నమనేని శ్రీరామమూర్తి కుటుంబసమేతంగా హాజరయ్యారు. శ్రీరామమూర్తి భార్య తన సంచులను కుర్చీపై పెట్టి వధూవరులను ఆశీర్వదించేందుకు వేదికపైకి వెళ్లారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మాదాపూర్ సీఐ శ్రీనాథ్‌రెడ్డి కథనం ప్రకారం.. బాడీగార్డు సినిమా దర్శకుడు గోపీచంద్ వివాహ రిసెప్షన్ మాదాపూర్‌లోని అవాస హోటల్‌లో శనివారం రాత్రి జరిగింది. పెళ్లి కొడుకు చిన్నాన్న అన్నమనేని శ్రీరాంమూర్తి, చిన్నమ్మ రత్నకుమారి రిసెప్షన్‌కు వచ్చారు. హ్యాండ్ బ్యాగ్‌స్టేజి పక్కన పెట్టి నూతన వధూవరులను ఆశ్వీరదించేందుకు వెళ్లారు. కొద్ది క్షణాల్లో తిరిగి వచ్చేసరికి బ్యాగ్ కనిపించలేదు. బ్యాగ్‌లో రూ. 1.23 లక్షల నగదు, 200 అమెరికన్ డాలర్లు, ఐదున్నర తులాల బంగారు నగలు, పెళ్లి కుమారుడి పర్సు ఉన్నాయి. శ్రీరాంమూర్తి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
ఇక టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ ఇంటివాడయ్యాడు. ప్రేమికుల రోజున శుభముహూర్తాన శ్రీసత్యతో గోపీచంద్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వీరి వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. త్వరలో హైదరాబాద్‌లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాడు గోపీచంద్.
గోపీచంద్ మలినేని సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన రవితేజతో 'బలుపు' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో శృతి హాసన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా పివిపి సినిమా బేనర్ పై గతంలో రవితేజతో వీడింతే చిత్రం రూపొందించిన ప్రసాద్ వి.పొట్లూరి 'బలుపు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు రవితేజతో గోపీచంద్ మలినేని 'డాన్‌శీను' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











