»   » సూపర్ స్టార్ షూటింగ్ లో బిజీ ,ఇంట్లో భార్య నగలు దొంగతనం, పోలీస్ కేసు

సూపర్ స్టార్ షూటింగ్ లో బిజీ ,ఇంట్లో భార్య నగలు దొంగతనం, పోలీస్ కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆయన భార్యకు చెందిన అర కోటికిపైగా విలువైన నగలు మాయమయ్యాయి. ఇంటి పనివాళ్లపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసారు.

అమీర్ ఖాన్ తన తాజా చిత్రం దంగల్‌పై బిజీగా ఉండగా ఆయన ఇంట్లో చోరీ జరిగింది. భార్య కిరణ్ రావుకు చెందిన సుమారు అర కోటిపైగా విలువైన బంగారు ఆభరణాలు కనిపించడంలేదు. వారం రోజుల కిందట బెడ్ రూమ్‌లో బంగారు ఉంగరం, డైమండ్ నక్లెస్ మాయమయ్యాయి. ఇంటి పనివాళ్లు దొంగిలించి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

Theft at Kiran Rao's home, jewellery worth Rs 80 lakh stolen

దంగల్ విషయానికి వస్తే...బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'దంగల్'. రియల్ లైఫ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇండియన్‌ రెజ్లర్‌ మహవీర్‌సింగ్‌ పొగట్‌ జీవిత కథపై ఈ మూవీ తెరకెక్కగా, డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ దశాబ్దాపు ఉత్తమ చిత్రం అంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ మూవీతో అమీర్ ఖాన్ మరోసార బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారంటూ ప్రచారం హోరెస్తున్నారు. 'దంగల్' మూవీ 'అమీర్' చేసిన '3 ఇడియట్స్', 'పీకే' కన్నా గొప్ప ఉంటుందని బాలీవుడ్ సెలెబ్రిటీస్ అంటున్నారు. మామూలుగానే 'అమీర్' సినిమాలపై అంచనాలు భారీగా ఉంటాయి. దీనికి తోడు ఈ వ్యాఖ్యలతో 'దంగల్' పై అంచనాలు మరింత పెరిగాయి. డిసెంబరు 23న 'దంగల్' ప్రేక్షకుల ముందుకొస్తుంది.

English summary
A ring and an expensive diamond necklace worth Rs 80 lakh has been missing from Kiran Rao's home in Bandra, Mumbai. Only a few weeks ago, the filmmaker-turned-producer discovered that some jewellery has been missing from her bedroom. And that's when her relative, under whose jurisdiction the family home falls, lodged a complaint at the Khar police station.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu