చిరు ఇంట్లో జరిగినట్టే.. మణిశర్మ స్టూడియోలోనూ ఊహించని సంఘటన..
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మణిశర్మ రికార్డింగ్ స్టూడియోలో చోరి జరిగింది. స్టూడియోలోని బీరువాలో ఉన్న నగదు మాయమవడం కలకలం రేపింది. వెంటనే మణిశర్మ మేనేజర్ సుబ్బానాయుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగింది:
సినిమా పనుల నిమిత్తం జనవరి 27న చెన్నై వెళ్లారు మణిశర్మ. తిరిగి ఈ నెల 2న హైదరాబాద్ వచ్చారు. స్టూడియోకి వెళ్లి శనివారం తన బీరువాను ఓపెన్ చేసి చూడగా అందులో నగదు మాయమవడం ఆశ్చర్యానికి గురిచేసింది.

పోలీసులకు ఫిర్యాదు:
నగదు మాయమవడంతో వెంటనే మేనేజర్ సుబ్బానాయుడుకి విషయం చెప్పారు మణిశర్మ. ఆపై బంజారాహిల్స్ పోలీసులకు ఈ చోరీ ఘటనపై ఫిర్యాదు చేశారు. డీఐ కె.రవికుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మణిశర్మ ఏమన్నారు:
ఆదివారం రోజు అవసరాల నిమిత్తం కొంత నగదు తీసేందుకు బీరువా ఓపెన్ చేసినట్లు మణిశర్మ చెప్పారు. అయితే అందులో దాచిన రూ.4లక్షల డబ్బు కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. మేనేజర్ తో చెప్పించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

పీఏ పైనే అనుమానం:
మణిశర్మ వ్యక్తిగత సహాయకుడు వెంకటేష్ పైనే మణిశర్మ తరుపువారు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటేషే దొంగతనానికి పాల్పడి ఉంటాడని మణిశర్మ మేనేజర్ సుబ్బానాయుడు తన ఫిర్యాదులోనూ పేర్కొన్నారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

చిరు ఇంట్లోనూ..:
మొన్నీమధ్యే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కూడా రూ.2లక్షల నగదు చోరీకి గురైన సంగతి తెలిసిందే. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఇంట్లో పనిచేసే వ్యక్తే ఆ చోరీకి పాల్పడ్డాడని తేలింది. ఆపై అతన్ని పట్టుకుని డబ్బును తిరిగి స్వాధీనం చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











