టాలీవుడ్ నిర్మాత కారులో దొంగతనం.. ఏం కొట్టేసారో తెలిస్తే షాక్!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కప్పుడు అగ్ర నిర్మాతగా వెలుగొందారు బెల్లంకొండ సురేష్. అనేక హిట్ చిత్రాలను నిర్మించిన ఆయనకు ఇద్దరు కుమారులు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్ ఇద్దరు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవలే సాయి శ్రీనివాస్ హిందీలో ఛత్రపతి సినిమా చేసిన విషయం తెలిసిందే.
వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీని బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఇదిలా ఉంటే తాజాగా బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. అందులో నుంచి దొంగలు కొట్టేసిన వస్తువులు ఏంటో ఆశ్చర్యపోకమానరు. పూర్తి వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh). అనేక బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన నందమూరి నటసింహం బాలకృష్ణతో చేసిన సినిమాలు భారీ హిట్స్ అందుకున్నాయి. బాలయ్యతో లక్ష్మీ నరసింహా, చెన్నకేశవ రెడ్డి సినిమాలు మంచి విజయం సాధించాయి. అంతేకాకుండా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో రభస, రామ్ పోతినేనితో కందిరీగ చిత్రాలు కూడా చేశారు.
ప్రస్తుతం నిర్మాతగా బెల్లంకొండ సురేష్ పరాజయాలు మూటగట్టుకుంటున్న ఆయను దొంగలు తాజాగా షాక్ ఇచ్చారు. బెల్లంకొండ సురేష్ కారులో జరిగిన చోరీ సంఘటన చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఉన్న సాయి గణేష్ ప్రొడక్షన్ కార్యాలయం ముందు బెల్లంకొండ సురేష్ బెంజి కారు పార్క్ చేసి ఉంది. అయితే శుక్రవారం అంటే జూన్ 9న ఉదయం చూసేసరికి కారు వెనుకవైపు అద్దం పగిలిపోయి ఉండటాన్ని గమనించారు.
కారు అద్దం పగిలిపోయి ఉండటంతో చెక్ చేసు చూశారు. ఆ కారులో ఉన్న రూ. 50 వేల నగదుతోపాటు 11 అత్యంత ఖరీదైన మందు బాటిళ్లు మాయమైనట్లు తెలిసింది. దీంతో ఈ విషయంపై బెల్లంకొండ సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. కారులో నుంచి రూ. 50 వేల నగదు కంటే 11 కాస్ట్‌లీ లిక్కర్ బాటిళ్లు చోరీకి గురి కావడం టాలీవుడ్ లో ఆశ్చర్యకరమైన వార్తగా మారింది.


Click it and Unblock the Notifications











