twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ ఇంట్లో దొంగతన ప్రయత్నం...బైక్ పై పరార్

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ ఇంటిలోకి అర్దరాత్రి ముగ్గురు ఆగంతకులు చొరబడేందుకు ప్రయత్నించిన సంఘటన కలకలం సృష్టిస్తోంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.

    పోలీసులు చెప్పిన దాని ప్రకారం...రోడ్డు నెంబర్ 12 , ఎమ్మల్యే కాలనీలో నివసించే పవన్ కళ్యాణ్ నివాసానికి అర్దరాత్రి 12 గంటల సమయంలో ముగ్గురు గుర్తు తెలియని యువకులు వచ్చి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వాచ్ మేన్ అడ్డుకోగా..అతనిపై దాడి చేసి రెండో అంతస్దుపైకి పరుగుతీసారు.

    అక్కడ డ్యూటీలో ఉన్న పవన్ కళ్యాణ్ బౌన్సర్ జాఫర్ వారిని అడ్డుకుని క్రిందవరకూ తీసుకుని వచ్చారు. వెంటనే పోలీసులకు పిర్యాదు చేసారు. అయితే పోలీసులు వచ్చేలోగా ఆగంతకులు బైక్ పై పరారయ్యారు. జాఫర్ ఫిర్యాదు మేరకు బంజారాహిస్ పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు ప్రారంభించారు.

    పవన్ తాజా చిత్రం విశేషాలకు వస్తే...

    Theft in Pawan Kalyan's house

    పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సర్దార్‌ గబ్బర్ సింగ్'. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్ లో షూటింగ్ జరుగుతోంది. రీసెంట్ గా 'సర్దార్‌' ఫస్ట్‌లుక్‌,టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. క్రేజ్ రావటంతో ఈరోస్ వారు ఈ చిత్రాన్ని 70 కోట్లకు అవుట్ రేటు కు తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    మరిన్ని విశేషాలకు వెళ్తే...

    పవన్‌ కల్యాణ్‌ ఖాకీ కడితే ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో 'గబ్బర్‌ సింగ్‌'లో చూశాం. 'నాక్కొంచెం తిక్కుంది. దానికో లెక్కుంది' అంటూ డైలాగులనే బులెట్లులా పేల్చారు అందులో. ఇప్పుడు మళ్లీ పవన్‌ కల్యాణ్‌ పోలీస్‌ అవతారం ఎత్తాడు. మరోసారి లాఠీ పట్టి హంగామా చేయబోతున్నాడు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాబీ దర్శకుడు. మొన్నటివరకూ ఈ ప్రాజెక్టు 'గబ్బర్‌సింగ్‌ 2' పేరు మీదే చలామణీ అయ్యింది. ఈ చిత్రానికి ఇప్పుడు సరికొత్త పేరు'సర్దార్‌ గబ్బర్ సింగ్' పెట్టారు.

    ఈ కొత్త షెడ్యూలుతో పవన్‌ కల్యాణ్‌ రంగ ప్రవేశం చేసారు, ఆయనపైకీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించారని తెలుస్తోంది. ఇక నుంచి ఏకధాటిగా ఈ సినిమాని పూర్తి చేయాలని పవన్‌ భావిస్తున్నారట. హీరోయిన్ గా కాజల్ ని నిర్ణయించినట్లు సమాచారం.

    నిర్మాత మాట్లాడుతూ ''ఈ సినిమా 'గబ్బర్‌సింగ్‌'కు సీక్వెలో ప్రీక్వెలో కాదు. ఇదో కొత్త కథ. పవన్‌ చిత్ర కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకొన్నారు. సినిమాలోని భావోద్వేగాన్ని ప్రతిఫలించేలా ఫస్ట్ లుక్ ను రూపొందించాం. దేవిశ్రీప్రసాద్‌ అందించిన బాణీలు ఆకర్షణగా నిలుస్తాయి''అన్నారు.

    'గబ్బర్‌ సింగ్‌ 2' విషయంలో అన్ని జాగ్రత్తలూ పవన్ తీసుకుంటున్నారు. ఆయన తన 'గబ్బర్‌ సింగ్‌ 2' కోసం ఓ నూతన నటుడ్ని ప్రతినాయకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేయబోతున్నారు. అతనే.. శరత్‌ కేల్కర్‌. ఈ మరాఠీ నటుడు 'గబ్బర్‌సింగ్‌ 2'తో ప్రతినాయకుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు.

    ప్రతినాయకుడి పాత్రకు ఎంతోమందిని పరిశీలించి, ఫొటో షూట్‌లు చేసి.. చివరికి పవన్‌ కేల్కర్‌ని ఎంచుకొన్నారట. ఇటీవల ఇతనిపై కొన్ని సన్నివేశాల్నీ తెరకెక్కించారు. కేల్కర్‌ నటన పట్ల పవన్‌ చాలా సంతృప్తితో ఉన్నారని తెలిసింది. కేల్కర్‌కి తెలుగురాదు. అయినా సరే... తెలుగు నేర్చుకొని, తన డైలాగులను తనేపలికాడట.

    కేల్కర్‌ గొంతులో గాంభీర్యం, వృత్తిపై అతనికున్న శ్రద్ధ పవన్‌కి బాగా నచ్చాయని చిత్రబృందం చెబుతోంది. ఇటీవల హైదరాబాద్ లో రెండో షెడ్యూలు నైట్ షూటింగ్ లతో మొదలైంది. బాబి దర్శకతం వహిస్తున్న ఈ చిత్రానికి శరత్‌మరార్‌ నిర్మాత.

    నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌, కెమెరా: జయనన్‌ విన్సెంట్‌.

    English summary
    Pawan Kalyan's Bouncer filed a complaint in the Jubilee Hills police station after a robbery took place in his house. A flat at MLA Colony as the 4,000 sft pad has been “lucky” for him. As he got his blockbuster films Gabbar Singh and Attarintiki Daaredi while staying there. More details are awaited.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X