సినీనటి రమ్యకృష్ణ ఇంట్లో చోరీ
చెన్నై: ప్రముఖ సినీనటి రమ్యకృష్ణ ఇంట్లో చోరీ జరిగింది. 70 సవర్ల బంగారం అపహరణకు గురైంది. దీంతో రమ్యకృష్ణ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు ఓ మహిళ వద్ద నుంచి 30 సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
రమ్యకృష్ణ ఇంట్లో చోరీ గుట్టు తెలిసింది. ఏడేళ్లుగా ఆమె ఇంట్లో పనిచేసిన పనిమనిషే చోరీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. చెన్నైలోని రమ్యకృష్ణ ఇంట్లో జ్యోతి అనే మహిళ ఏడేళ్లుగా పని చేస్తోంది. చెన్నైలోని ఆలివ్ బీచ్ రోడ్‌లో ఉన్న ఈ ఇంట్లో రమ్యకృష్ణ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఉంటున్నారు.
కొంతకాలం కిందట తన బంధువులు చనిపోయారని చెప్పి వెళ్లిపోయింది. ఆ తర్వాత చూసుకుంటే ఇంట్లోని కప్‌బోర్డులో పెట్టిన 70 సవర్ల బంగారు, వజ్రాల ఆభరణాలు మాయమయ్యాయి. దీంతో రమ్యకృష్ణ తల్లి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు గురువారం జ్యోతిని గుంటూరులో అరెస్టు చేశారు. ఆమె నుంచి 30 సవర్ల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.


Click it and Unblock the Notifications












