వీడియో: శ్రీనివాస కళ్యాణం కాన్సెప్ట్ టీజర్..ఆడియో విడుదల తేదీ ఖరారు!

యంగ్ హీరో నితిన్ తాజాగా నటిస్తున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న తెరకెకెక్కిస్తున్న ఈ చిత్ర కాన్సెప్ట్ టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. సీనియర్ నటి జయసుధ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ రూపొందించారు. చిత్ర నేపథ్యాన్ని వివరించేలా టీజర్ ఉంది.

'మనం పుట్టినప్పుడు మనవాళ్ళందరూ సంతోషిస్తారు.. మనం దూరమైనప్పుడు మనవాళ్ళందరూ భాదపడుతారు. అది కూడా మనకు తెలియదు. మనకు తెలిసి, మనం సంతోషంగా ఉండి, మనవాళ్లంతా సంతోషంగా ఉండేది ఒక్క పెళ్ళిలో మాత్రమే. అలాంటి పెళ్లి గొప్పతనం వివరించే ఓ చిన్ని ప్రయత్నమే మా శ్రీనివాస కళ్యాణం' అంటూ టీజర్ మొత్తం జయసుధ వాయిస్ ఓవర్ తో సాగింది.

Theme of Srinivasa Kalyanam Concept Teaser released

ఈ టీజర్ లోనే ఆడియో వేడుక తేదీని కూడా ఖరారు చేశారు. జులై 22 న శ్రీనివాస కళ్యాణం ఆడియో వేడుక జరగబోతోంది. నితిన్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జయసుధ, నరేష్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగష్టు 9 న చిత్రం విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X