నాన్న పై ప్రతీకారం తీర్చుకున్నా, మా అమ్మ మీద పగ అలా తీర్చుకుంటా: రామ్‌గోపాల్ వర్మ
మా అమ్మ కూడా నేను పెద్దగా ఏమీ సాధించని సాధారణ మనిషిగా ఉండి పోతానని భావించింది, ఇప్పుడు నా రివేంజ్ పూర్తవుతుంది అంటూ చిన్ననాటి ఫొటోలని పోస్ట్ చేసాడు రామ్‌గోపాల్ వర్మ.
Recommended Video

ప్రతి రోజు ఏదో ఒక వివాదంతో, వ్యఖ్యతో వార్తల్లో నిలిచే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ క్రియేటివ్ డైరెక్టర్ మాత్రమే కాదు. న్యూస్ క్రియేటర్ కూడా. ఆ మధ్య వర్మ నిత్యం ఎవరోకరి గురించో, ఏదోక మేటర్ మీదో కామెంట్ చేసి అందరినీ తనవైపు తిప్పుకునే టెక్నిక్ వర్మకి బాగా తెలుసు.

కూతురు రేవతీవర్మ
నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ కొడుకు పేరువిషయం లో అంత గొప్ప పేరు తానెప్పుడూ వినలేదంటూ సెటైర్ వేసి, తర్వాత కూతురు రేవతీవర్మ తోనే వ్యతిరేకత ఎదుర్కున్న వర్మ ఆ విషయాన్ని కూడా అందరికీ తెలిసేలా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు... అలా ఆ కాంట్రవర్సీ గడిచి ఒక్క రోజు అయ్యిందో లేదో మళ్ళీ ఇప్పుడు వర్మ నాన్నగారైన కృష్ణం రాజు వర్మ మీద ఇంకో పోస్ట్ పెట్టాడు.

తండ్రి గురించి, అమ్మ గురించీ
ఒకనాటి సంగతులు గుర్తు తెచ్చుకుంటూనే తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. ప్రతీసారీ పవన్ కళ్యాణ్ నీ బయటి జనాన్నీ అనీ అనీ బోరొచ్చిందేమో అందుకే ఈసారి తన తండ్రి గురించి, అమ్మ గురించీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పబ్లిసిటీలో భాగంగానే
నిజానికి అసలు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నాగార్జునతో తాను తీయబోతున్న సినిమాకి పబ్లిసిటీలో భాగంగా అనుకోవాలి. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరక్షన్‌లో నాగార్జున హీరోగా కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. శివ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ .

మళ్ళీ 25 ఏళ్ల తర్వాత
మళ్ళీ 25 ఏళ్ల తర్వాత నాగార్జునతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక వర్మతో సినిమా ఖాయమని అక్కినేని నాగార్జున కూడా ధ్రువీకరించారు. 25ఏళ్ల తర్వాత నాగార్జునతో మళ్లీ సినిమా చేయబోతున్నానని, శివ లానే దీన్ని కూడా సక్సెస్ ఫుల్ చిత్రంగా తెరకెక్కిస్తాననే నమ్మకంతో వున్నానని నిన్న చెప్పిన వర్మ ఈ రోజు ఇక ఆ సినిమా ప్రమోషన్ ని అనధికారికంగా మొదలు పెట్టాడు.

తండ్రితోనే 'శివ'కు తొలి క్లాప్ కొట్టించా
ఇంతకీ వర్మ అన్న మాటలేమిటీ అంటే... తాను సినీ దర్శకుడిని అవుతాననే విషయాన్ని తన తండ్రి ఎన్నడూ నమ్మలేదని , అయితే, తన తొలి సినిమా అయిన 'శివ'కు తొలి క్లాప్ ను తన తండ్రితోనే కొట్టించానని... ఆ విధంగా ఆయనపై ప్రతీకారం తీర్చుకున్నానని ఫేస్ బుక్ ఫేస్ బుక్ లో చెప్పాడు. 1989 ఫిబ్రవరి 16వ తేదీన ముహూర్తపు క్లాప్ ను కొట్టారు. నాగార్జున, అమలపై క్లాప్ కొట్టారు.

నా రివేంజ్ పూర్తవుతుంది
ఇక ఆ తర్వాత కొద్దిసేపటికే "మా అమ్మ కూడా నేను పెద్దగా ఏమీ సాధించని సాధారణ మనిషిగా ఉండి పోతానని భావించింది. అందుకే ఇప్పుడు నాగార్జునతో తీస్తున్న సినిమాకి ఆమెతో క్లాప్ కొట్టిస్తాను దానితో నా రివేంజ్ పూర్తవుతుంది. అంటూ తల్లితో తీసుకున్న చిన్న నాటి ఫొటోని పెట్టాడు.


Click it and Unblock the Notifications











