తమన్నాకి, నాగచైతన్యకి మధ్య గొడవెందుకూ...!
నాగచైతన్య, తమన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం '100% లవ్'. ఈ చిత్రంలో ప్రేమకు, ఆకర్షణకు మద్య దూరాన్ని కొలిచే ప్రయత్నం చేసారు దర్శకుడు సుకుమార్. ఈ మద్యనే విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం మే 6న విడుదల కానుంది.
తమన్నాకి, నాగ చైతన్యకి మధ్య ఇప్పుడు క్షణం కూడా పడటం లేదట. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై పోట్లాటే. ఇద్దర్నీ ఎవరైనా చూస్తే కనుక అసలు వాళ్లెందుకు తగవులాడుకుంటున్నారో అర్ధంకాదు. ఈ విషయాన్ని తమన్నానే చెబుతోంది. అయితే...ఇది నిజజీవితంలో కాదులెండి. త్వరలో విడుదల కానున్న '100% లవ్' సినేమాలోనన్న మాట!
'అందులో నా పేరు మహాలక్ష్మి. తన పేరు బాలు. ప్రతి చిన్న విషయానికీ ఇద్దరం పోట్లాడుకుంటూ వుంటాం. మరోలా చెప్పాలంటే కార్టూన్ ఫిలిం 'టాం అండ్ జెర్రీ' టైపన్న మాట. మామధ్య ఇలా చిటపటలున్నా.. చూసే వాళ్లకి మాత్రం మంచి ఫన్ గా వుంటుంది' అంటోంది తమన్నా. ఈ సినిమా మే మొదటి వారంలో రిలీజ్ అవుతోంది. చాలా కాలం తర్వాత వస్తున్న తన తెలుగు చిత్రం కాబట్టి, దీని మీద చాలా హోప్స్ పెట్టుకుంది. దీంతో బాటు 'బద్రీనాథ్', 'ఊసరవెల్లి' చిత్రాలు తనని టాలీవుడ్ లో నెంబర్ వన్ స్టార్ ని చేసేస్తాయని ఆశిస్తోంది తమన్నా.


Click it and Unblock the Notifications











