twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యాన్ క్లబ్ లేని అనుష్క!

    By Staff
    |

    అవార్డుల కంటే ప్రేక్షకుల రివార్డులే ప్రధానమని ఆర్టిస్టులు తరచు ప్రకటిస్తుంటారు. అభిమానుల ఆదరణే తమకు స్టార్ డమ్ తెచ్చిపెడుతుందని బలంగా నమ్ముతునంటారు. సహజంగానే స్టార్ ఫ్యామిలీల నుంచి వచ్చే వారసులకు ఆయా ఫ్యామిలీల అభిమానులంతా అండగా నిలుస్తుంటారు. మరికొన్ని ఫ్యాన్ క్లబ్ లు అదనంగా వెలుస్తుంటాయి. హీరోయిన్లు కూడా ఈ విషయంలో తక్కువేం కాదు. త్రిష, నమిత వంటి హీరోయిన్లకు తమిళనాటు బలమైన అభిమాన సంఘాలే ఉన్నాయి. నమితకు ఏకంగా అభిమానులు గుడి కట్టించేశారు కూడా. ఈమధ్యన త్రిషకు సైతం అభిమాల నుంచి ఇలాంటి ప్రపోజల్ ఒకటి వస్తే 'గుడిలో ఉండేది దేవతలు..నావంటి వాళ్లు కాదు' అంటూ సున్నితంగా నిరాకరించిందట. ఇప్పుడు అందాల నటి అనుష్క వంతు వచ్చింది. ఈమధ్యనే ఫ్యాన్ క్లబ్ ఏర్పాటు చేస్తామంటూ కొందరు అభిమానులు అనుష్కను సంప్రదించారట. ఇందుకు ఆమె నవ్వుతూ నో చెప్పేసిందట.

    అనుష్క ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ 'అభిమానుల నుంచి ఇలాంటి ప్రపోజల్ వచ్చిన మాట నిజమే. అయితే నేను వద్దని చెప్పి పంపేశాను. ఇప్పుడు నా దృష్టంతా కెరీర్ మీదే ఉంది. కెరీర్ లో సాధించాల్సింది కూడా చాలా ఉంది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత మాత్రమే ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తాను' అని తన నిరాడంబరతను చాటుకుంది. ఇటీవలే విడుదలైన 'అరుంధతి' చిత్రం అనుష్క కెరీర్ ను ఒక్కసారిగా మలుపు తిప్పడంతో ఇప్పుడు ఆమె పలు ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ లకు పనిచేస్తుంది. ప్రిన్స్ మహేష్ బాబు సరసన 'వరుడు' చిత్రంలోనూ, క్రిష్ ('గమ్యం' ఫేమ్) 'వేదం' చిత్రంలోనూ ఆమె నటిస్తోంది. తమిళంలో విజయ్ సరసన 'వెట్టైకారన్', సూర్య 'సింగం'లోనూ నటిస్తోంది. కేవలం ఒక సినిమా చేసి ఫ్యాన్ క్లబ్ ల కోస తహతహలాడే హీరోయిన్ల మధ్య అలాంటివేవీ వద్దని చెప్పే హీరోయిన్ ఉండటం విశేషమే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X