twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవుడు లేడు... కులం ఇష్యూపై మెగా బ్రదర్ నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్

    |

    Recommended Video

    Naga Babu Says There Is No God,We Need Religion And Caste Free Society || Filmibeat Telugu

    ప్రముఖ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు కొన్ని రోజులుగా ఎన్నికల హడావుడి ముగితేలారు. పోలింగ్ ముగియడంతో రిలాక్స్‌ అవుతున్నారు. ఇటీవల ఆయన దర్శకుడు మెహర్ రమేష్‌తో కలిసి అభిమానులతో లైవ్ చాట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించిన కులం, మతం అంశంపై రియాక్ట్ అయ్యారు.

    'మతాలు, కులాల గురించి మీ ఉద్దేశ్యం ఏమిటి? భారతీయ సంస్కృతిలో వాటి ప్రాముఖ్యత ఏమిటి?' అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు నాగబాబు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. రెండు సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు తన ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు.

    అప్పుడు భయంకరమైన ఆస్తికుడిని, కానీ..

    అప్పుడు భయంకరమైన ఆస్తికుడిని, కానీ..

    ‘‘మతం, కులం గురించి చెప్పేముందు నాలో వచ్చిన ఓ మార్పు గురించి చెప్పాలి. నేను 2 సంవత్సరాల క్రితం వరకు భయంకరమైన ఆస్తికున్ని.. చాలా పూజలు చేసేవాడిని, జాతకాలు నమ్మేవాడిని, యజ్ఞాలు, హోమాలు చేసేవాడిని. మా నాన్న ఆంజనేయ స్వామికి పెద్ద భక్తుడు, మా ఇంట్లో అందరూ అలాగే ఉంటారు. సంవత్సరం క్రితం వరకు కూడా భక్తితో ఉండేవాడిని.'' అని నాగబాబు చెప్పుకొచ్చారు.

    రియలైజ్ అయ్యాను, దేవుడు లేడు

    రియలైజ్ అయ్యాను, దేవుడు లేడు

    ‘కానీ ఒక రోజు నేను రియలైజ్ అయ్యాను. దేవుడు లేడు. దేవుడు లేనపుడు మతం అనే ప్రశ్నే ఉండదు. మతం లేనపుడు కులం కూడా ఉండదు. నా ఆలోచన స్థాయి ప్రకారం.. మతం అనేది అన్నింటికంటే పెద్ద ఇష్యూ. మతాల వల్లే కులాలు పుట్టాయి. మతం లేనపుడు కులం లేదు. కానీ మతం వద్దు, కులం వద్దు అని చెప్పే పరిస్థితి లేదు.

    కులరహితంగా ఉండే సమాజం గొప్ప సమాజం

    కులరహితంగా ఉండే సమాజం గొప్ప సమాజం

    నా ఉద్దేశ్యంలో కులరహితంగా ఉండే సమాజం గొప్ప సమాజం. అయితే మతాలు, కులాలు సమాజంలో సెట్టయిపోయాయి కాబట్టి మనం ఎవరినీ తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. కానీ వాటి తాలూకు ప్రభావం ప్రజల్లో చాలా ఎక్కువగా ఉంది.

    కళ్యాణ్ బాబు అదే చేస్తున్నాడు

    కళ్యాణ్ బాబు అదే చేస్తున్నాడు

    ప్రజల్లో కులం, మతం ప్రభావం తొలగించి.. మనం అందరం భారతీయులం అనే భావన తీసుకురావాలి. కళ్యాణ్ బాబు అదే చేస్తున్నారు. కులాలన్నింటినీ కలిపి మత ప్రభావం లేని భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకొస్తున్నాడు. అది చాలా స్లోగా వర్కౌట్ అవుతుంది. మొన్న ఎన్నికల్లో కూడా అదే వర్కౌట్ అయింది.

    అగ్రకులం వాళ్లు మేమే గొప్ప అని

    అగ్రకులం వాళ్లు మేమే గొప్ప అని

    కులాలు సౌకర్యం కోసం పెట్టుకున్నవే తప్ప... ఒక మనిషిని కులం కారణంగా తక్కువగా చూడటం అనేది ఉండకూడదు. కానీ అలాగే జరుగుతోంది. ఇతడు తక్కువ కులం వాడు, అతడు అగ్రకులం వాడు ఆనే ఆలోచనే మన సమాజంలో ఉన్న అనారోగ్యకరమైన ఆలోచన. అగ్రకులం వాళ్లు మేమే గొప్ప అని భావించడంతో పాటు తక్కువ కులం వారిలో ఒక ఆత్మన్యూన్యత భావం క్రియేట్ చేశారు.

    ఇప్పుడిప్పుడే ఆ ఫీలింగ్ నుంచి బయటపడున్నారు

    ఇప్పుడిప్పుడే ఆ ఫీలింగ్ నుంచి బయటపడున్నారు

    క్రింది వర్గాల్లో ఉన్న వారు ఇప్పుడిప్పుడే ఆ ఫీలింగ్ నుంచి బయటపడి మేము కూడా అందరితో సమానం అనే ఆలోచన చేస్తున్నారు. పోరాటం చేస్తున్నారు. ఆ ఆలోచనకు ఆజ్యం పోసింది అంబేద్కర్. గాంధీ గారు స్వతంత్ర్యం కోసం ఎంత గొప్పగా పోరాటం చేశారో జనాల్లో ఉండే అసమానతల గురించడానికి అంబేద్కర్ అంతే గొప్పగా ప్రణాళికలు తయారు చేశారని నాగబాబు తెలిపారు.

    English summary
    There is no God, We need Religion and caste free society says Naga Babu in the latest Facebook LIVE Interview with Tollywood Director Meher Ramesh. Naga Babu talks about his Co-Stars, Politics, Movies, Social Activities & many in an exclusive Q & A with his Facebook Fans.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X