నిజం కక్కలేని బయోపిక్ ఎందుకు? నాగబాబు సంచలన వ్యాఖ్యలు
Recommended Video

ఓ వైపు తెలుగులో వరుసగా బయోపిక్ చిత్రాలు విడుదలవుతున్న వేళ మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు బాలయ్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ గురించే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కొన్ని రోజుల క్రితం బాలకృష్ణ ఎవరో తనకు తెలియదు? అంటూ వ్యాఖ్యానించడం ద్వారా మీడియాలో చర్చనీయాంశం అయిన నాగబాబు ఇపుడు బాలయ్య నటిస్తున్న బయోపిక్ చిత్రాన్ని టార్గెట్ చేస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయింది.

నిజం కక్కలేని బయోపిక్కులొద్దమ్మా...
కట్టు కథలు కొన్ని.. కల్పనలు కొన్ని.. చుట్ట నేల.. మూట కట్టనేల.. నిజం కక్కలేని బయోపిక్కులొద్దమ్మా.. విశ్వధాభి రామ వినరా మామ... (కవిత్వాలు మాకూ వచ్చండోయ్) అంటూ ఓ పోస్టు పెట్టారు.

ఇక పై వరుస సెటైర్లు
తన పోస్టులో స్టే ట్యూన్డ్ అని వ్యాఖ్యానించడం ద్వారా.... ఇకపై తన సోషల్ మీడియా పేజీ నుంచి ఇలాంటి వరుస సెటైర్లు వస్తాయని చెప్పకనే చెప్పారు మెగా బ్రదర్. మరి ఇకపై నాగబాబు వదిలే కవిత్వాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

వరుణ్ తేజ్ సపోర్ట్
బాలకృష్ణ ఎవరో తెలియదు అని నాగబాబు చేసిన వ్యాఖ్యలపై వరుణ్ తేజ్ కొన్ని రోజుల క్రితం స్పందించారు. నాన్నకు ఏదనిపిస్తే అది చేస్తాడు... రాజకీయాల్లో వ్యక్తుల మధ్య డిఫరెన్సెస్ ఉంటాయి. ఒకరిని ఒకరు మాట అనుకోవడం మామూలే. ఆయన(బాలయ్య) కూడా కళ్యాణ్ బాబాయ్ ఎవరో తెలియదు అనడం నేను చూశాను. నాన్నను అడిగితే ‘‘ఆయన అలా అన్నపుడు నేను ఇలా అనడంలో తప్పేంటి?'' అన్నారని వరుణ్ తేజ్ వెల్లడించారు.

మెగా అభిమానుల రియాక్షన్
కాగా... నాగబాబు రాసిన ఈ కవితకు మెగా అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. వేలాదిగా ఈ కవితను షేర్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ నాగబాబుపై ప్రశంసలు గుప్పిస్తుంది. చివరకు ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి


Click it and Unblock the Notifications











