'రక్త చరిత్ర' లో పరిటాల రవి, మద్దెల చెరువు సూరి లేనే లేరు
మీరు అనుకుంటున్నట్టు నా సినిమాలో పాత్రలకు పరిటాల రవి, మద్దెల చెరువు సూరి ఎవరూ లేరు...నేను నా పాత్రలకు ఆ పేర్లు పెట్టలేదు. ఇది వాళ్ల జీవిత చరిత్ర కాదు. కేవలం వారి కథల్ని స్ఫూర్తిగా అల్లుకున్న చిత్రమని రామ్ గోపాల్ వర్మ తాజాగా రక్త చరిత్రలోని పాత్రల గురించి క్లారిఫై ఇచ్చారు. చట్టపరమైన సమస్యలు వస్తాయనే ఆ పేర్లను చిత్రంలో పెట్టలేదని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఎవ్వరినీ హీరోగానో.. విలన్ గానేచూపించలేదు. అప్పటి పరిస్థితులే ముఖ్యం అని ఆయన అన్నారు. తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల్లో రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందించారు. వివేక్ ఒబరాయ్, సూర్యలు మూడు భాషల్లోనూ కనిపిస్తారు. ఎన్టీఆర్ పాత్రలో శతృఘ్న సిన్హా కనిపిస్తారు. ప్రియమణి...సూర్య భార్యగానూ, రాధా ఆప్టే..వివేక్ ఒబరాయ్ భార్యగానూ కనిపించనున్నారు.
More from Filmibeat
రామ్ గోపాల్ వర్మ సూర్య రక్తచరిత్ర పరిటాల రవి వివేక్ ఒబరాయ్ సూరి rakta charitra ram gopal varma surya vivek oberoi shiva anatapur paritala ravi suri


Click it and Unblock the Notifications











