ఎక్స్‌పోజింగ్‌కు చరణ్ హీరోయిన్ రెడీ
ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించిన సెకండ్ హీరోయిన్ షాజన్ పదంసీ గుర్తుందిగా. సినీ పరిశ్రమలో అడుగు పెట్టి ఇప్పటి వరకు మూడు నాలుగేళ్లు పూర్తయినా అమ్మడు కనీసం నాలుగు సినిమాలు కూడా పూర్తి చేయలేదు. దీంతో షాజన్ ఎక్స్ ఫోజింగ్ పై దృష్టి పెట్టింది. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో ఆమె మాట్లాడుతూ ఎక్స్ ఫోజింగ్ చేయడం తప్పేమీ కాదు. అందాలు ప్రదర్శించడం అనేది ఒక కళ, మ్యాగజైన్లపై హాట్‌గా కనిపించడం సెలబ్రిటీ సింబల్ అంటూ చెప్పుకొచ్చింది.
షాజన్ తీరు చూస్తుంటే త్వరలో ఈవిడ కూడా బరితెగించడానికి సిద్ధం అవుతుందని, ఏదో ఒక మ్యాజగైన్ పై హాట్‌గా అందాలు ఆరబోసేందుకు సిద్దం అవుతుందనే వార్తలు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. షాజన్ పదంసీ ప్రస్తుతం బాలీవుడ్ లో హౌస్‌ఫుల్-2 చిత్రంలో నటిస్తోంది. ఆమె నటించిన 'కనిమొళి' అనే తమిళ చిత్రంలో తెలుగులో 'ప్రేమించవా నన్ను' అనే టైటిల్ తో త్వరలో అనువాదం కాబోతోంది. ఈ చిత్రంలో కలర్స్ స్వాతితో పాటు, జర్నీ ఫేం జై నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











