»   » అప్పుడు భూమిక నడుము..., ఇప్పుడు శృతీ హసన్ నడుము ., కాటమ రాయుడు లో పవన్ రొమాంటిక్ ఖుషీ సీన్

అప్పుడు భూమిక నడుము..., ఇప్పుడు శృతీ హసన్ నడుము ., కాటమ రాయుడు లో పవన్ రొమాంటిక్ ఖుషీ సీన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పదిహేనేళ్ళ క్రితం అప్పౌడప్పుడే పవన్ కళ్యాణ్ స్టార్ గా తనకంటూ ఒక బేస్ ఏరొపరుచుకుంటున్నరోజుల్లో పవన్ ఎనిమిదో సినిమాగా వచ్చింది ఖుషీ. తమిళం లో అప్పటికే విడుదలైన సినిమాను రీమేక్ చేసి 'ఖుషి' అంటూ వచ్చిన ఈ సినిమా అప్పట్లో యూత్ కి ఒక తుఫానే అయ్యింది. అంతే... పవన్ కెరీర్ బిఫోర్ ఖుషి, ఆఫ్టర్ ఖుషిగా మారిపోయింది.

పవన్ స్టైల్ అప్పటి జెనరేషన్ కి విపరీతంగా నచ్చేసి ఆ సినిమా కారణాన ఎంతో మంది ఇప్పటికీ తన హార్డ్ కోర్ ఫ్యాన్స్ గా మిగిలిపోయారు. ఇప్పటి పవన్ ఫ్యాన్స్ లో సగం మంది ఖుషీ తో వచ్చిన వాళ్ళే. అందులో భూమిక నడుము సీన్ ఎప్పటికీ గుర్తుండిపోయే సీన్ కదా... నిజానికి పవన్ కళ్యాణ్ పైకి రొమాంటిక్ హీరోగా కనిపించినా, రొమాంటిక్ సన్నివేశాల్లో మాత్రం చాలా ఇబ్బంది పడతాడట. 'నాకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయ్.. కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో చాలా ఇబ్బంది పడుతుంటా' అని ఓ ఛానెల్ ఇంటర్‌వ్యూ లో పవన్ చెప్పుకొచ్చాడు.

there is one more romantic situation like Kushi movie

మరి 'ఖుషి' సినిమాలో భూమిక నడుము చూసేటప్పుడు ఏమనిపించిందంటూ యాంకర్ అడిగేసరికి అసలు విషయం చెప్పాడు అసలు తాను చూసింది భూమిక నడుముని కాదనీ కెమెరా వైపు రొమాంటిక్ గా చూసాననీ చెప్పాడు... పవన్ ఎక్కడ చూసినా మనకెలా కనిపించిందన్నదే ముఖ్యం కాబట్టి మనకు సంబందించినంత వరకూ పవన్ భూమిక నడుము చూసినట్టే...

అయితే పదిహేనేళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ అలాంటి మెస్మరైజింగ్ సీన్ కి పచ్చ జెండా ఊపేసాడట పవర్ స్టార్ ఇంతకీ ఆ వార్త ఏమంటే ఖుషీలో ఉన్న నడుం సీన్ మాదిరిగా కాటమ రాయుడు లోను శృతి హాసన్ తో పవన్ కళ్యాణ్ చేసే రొమాన్స్ ను చాలా వెరైటీగా తెరకెక్కించారట. ఖుషీలో భూమిక నడుం చూస్తూ పవన్ నటించన తీరు ఒక ఎత్తైతే, కాటమరాయుడు లో శృతి నడుం అందాలను చూస్తూ పవన్ చేసిన కామెడీ సీన్ థియేటర్ దద్దరిల్లేలా చేస్తుందని టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా శివరాత్రి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. వీరమ్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఐదుగురు అన్నదమ్ముల నేపథ్యంలో నడవనుందని తెలుస్తోంది.

English summary
pawan and sruthi hasan are acting togather in a romantic scene in Katamarayudu. pawan romancing with sruthi hasan its regembles the same scene from Kushi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu