మోక్షజ్ఞ గురించి బోయపాటి అలా...ఫ్యాన్స్ డీలా!
హైదరాబాద్: చాలా కాలం తర్వాత బాలయ్యతో గురి కుదిరిన దర్శకుడు బోయపాటి శ్రీను. బాలయ్య అభిమానులకు సంతృప్తినిచ్చే విధంగా బాలయ్యతో సినిమాలు తీసి సూపర్బ్ అనిపించుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఇతర దర్శకులతో బాలయ్య సినిమాలు కమిటైతే టెన్షన్ పడే ఫ్యాన్స్....బోయపాటి డైరెక్షన్ అంటే మాత్రం గుండెల మీదన చేయివేసుకుని రిలాక్స్ అయ్యే పరిస్థితి తెచ్చాడంటే అతనిపై బాలయ్య ఫ్యాన్స్ ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
బాలయ్య వారసుడు మోక్షజ్ఞ కూడా బోయపాటి దర్శకత్వంలోనే తెరకు పరిచయం అవుతుందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలు విన్నప్పటి నుడి ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు. అయితే మోక్షజ్ఞ తొలిసినిమా గురించి తాజాగా బోయపాటి చేసిన వ్యాఖ్యలతో ఫ్యాన్స్ డీలా పడ్డారు.

బోయపాటి ఏమన్నాంటే...
మోక్షజ్ఞని తెరకు పరిచయం చేసే బాధ్యతని కూడా బాలయ్య నాకే అప్పగించారని బయట ప్రచారం సాగుతోంది. మోక్షజ్ఞ తెరపైకి రావడానికి ఇంకా మూడేళ్ల సమయం ఉంది. అప్పుడు ఆ పరిస్థితుల్ని బట్టి బాలయ్య నిర్ణయం తీసుకొంటారు. అప్పటి పరిస్థితిని బట్టి అతని తొలిచిత్రానికి దర్శకుడెవరనేది నిర్ణయమవుతుంది అన్నారు.
ఇప్పటి వరకు మోక్షజ్ఞ తొలి చిత్రానికి బోయపాటి దర్శకత్వం వహిస్తారని కూల్‌గా ఉన్న ఫ్యాన్స్....తాజాగా బోయాపాటి చేసిన వ్యాఖ్యలతో కాస్త అసంతృప్తికి గురయ్యారు. వాళ్ల టెన్షన్ చూస్తుంటే బోయపాటి తప్ప మరే దర్శకుడిపైనా నందమూరి బాలయ్య ఫ్యాన్స్‌కు గురి కుదరడం లేదని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











