twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెదాలతో టచ్: అయినా అది ముద్దు కాదంటోన్న ప్రణీత

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రంలో హీరో మనోజ్, హీరోయిన్ ప్రణీత లిప్ లాక్ ముద్దులో మునిగి తేలుతున్నట్లు ఓ ఫోటో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే ప్రణీత తొలి ముద్దు సీన్, అమ్మడు ఇరగదీసింది అంటూ టాలీవుడ్ సర్కిల్లో చర్చనీయాంశం అయింది. కొందరు నిర్మాతలు కూడా ఆమెను తమ తర్వాతి సినిమాల్లో బుక్ చేసిని ముద్దు చేయించాలనే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు.

    ఈ పరిణామాలతో కంగుతిన్న హీరోయిన్ ప్రణీత మీడియాకు వివరణ ఇచ్చింది. తాను ఎలాంటి ముద్దు సీన్లో పాల్గొనలేదని స్పష్టం చేసింది. మరి ఏ ఫోటో సంగతేంటి? అని ప్రశ్నకు సమాధానం ఇస్తూ.....అది సినిమాలోని సాంగులో చిన్న భాగమని, అది ఒక సెకన్ కూడా ఉండదు, అది అసలు ముద్దు సీనే కాదు అని చెప్పుకొచ్చింది. రాబోయే సినిమాలో తాను బికీనీ వేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని ప్రణీత తేల్చి చెప్పింది.

    There’s no lip-lock in the PPT : Pranitha

    పాండవులు పాండవులు తుమ్మెద సినిమా వివరాల్లోకి వెళితే...శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై అరియానా-వివియానా సమర్పణలో మంచు విష్ణువర్ధన్-మనోజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీ స్టారర్లో రవీనా టండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లు. 'లక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.

    ఈ చిత్రానికి సంగీతం : కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్, కెమెరా : ఫలణికుమార్, పాటలు: చంద్రబోస్-భాస్కరభట్ల-అనంత శ్రీరామ్, మాటలు: డైమండ్ రత్న, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-బివిఎస్ రవి-గోపీ మోహన్, పోరాటాలు: విజయ్, ఎడిటింగ్: ఎంఆర్ వర్మ, కళ: రఘు కులకర్ణి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కుమార్.ఆర్, సమర్పణ: అవియానా-వివియానా, నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్, దర్శకత్వం: శ్రీవాస్.

    English summary
    "There’s no lip-lock in the Pandavulu Pandavulu Thummeda. The picture that’s doing rounds on the internet has been taken from a song and it doesn’t even last for more than a second." Actress Pranitha told.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X