బూతు పాటలు..బూతు డాన్స్ లంటూ డ్రీమ్ గర్ల్
''పాటల్లో అశ్లీలత తారా స్థాయికి చేరుకుంది. ఇదంతా నేను చూడలేకపోతున్నాను...సినిమాల్లో శాస్త్రీయ నృత్యాన్ని చూడలేకపోతున్నాను. కానీ 'మున్నీ బద్నామ్ హుయీ', 'జిలేబీ బాయ్' లాంటి నృత్యాలను మాత్రమే నేటి ప్రేక్షకులు ఇష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. నిర్మాతలకు సైతం శాస్త్రీయ నృత్యంపై సినిమా తీయాలనే ఆలోచన రావటంలేదు'' అని అలనాటి 'డ్రీమ్ గర్ల్' హేమమాలిని వాపోయారు. దాదాపు 19 సంవత్సరాల తర్వాత 'టెల్ మీ ఓ ఖుదా' అనే చిత్రానికి ఆమె దర్శకత్వం వహిస్తున్నారు.
ధర్మేంద్ర, రిషీ కపూర్, వినోద్ ఖన్నా, ఈషా డియోల్ ఈ చిత్రంలో ప్రధాన భూమికలు పోషిస్తున్నారు. ఆ విషయాలు ప్రస్దావిస్తూ...దర్శకత్వంలో నాటకీయ మార్పులు వచ్చాయి. టెక్నలాజికల్ అడ్వాన్స్‌మెంట్ సినిమా దర్శకత్వాన్ని కొత్త స్థాయికి చేర్చింది. టెక్నాలజీని పూర్తిగా వినియోగించటమనేది చాల ముఖ్యం. అయితే పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది.అలాగే చాలా సార్లు చూశాను కదా.. ఇక్కడ సరిగ్గా రాలేదని నేను కెమెరా మ్యాన్‌కు చెప్పాననుకోండి.. వారంటారు కదా.. మరేం పర్లేదు మేడమ్.. అవన్నీ పోస్ట్ ప్రొడక్షన్‌లో సరిచేసుకోవచ్చు అని బదులిస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ ఖరీదైనది మాత్రమే కాక దానికి చాలా సమయం పడుతుంది. అప్పట్లో ప్రతిదీ సరిగ్గా నటించుకుంటూ పోవటమే తప్ప మరో ప్రత్యామ్నాయం మాకుండేది కాదు. అనాటి హీరోయిన్లు చాలా అందంగా ఉండేవారు. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో సైతం మధుబాల, మీనా కుమారి లాంటి హీరోయిన్లు తెరపై అద్భుతంగా కనిపించేవారు. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు. చాలా చక్కగా చిత్రీకరించేవారు. లైటింగ్ చాలా బాగుండేది. అలాంటి అందాన్ని ఇకపై మనం వెండితెరపై చూడలేం.
సెకండ్ల వ్యవధిలోనే సన్నివేశాలు మారిపోతుండటంతో హీరోయిన్‌ను సైతం నేడు సరిగ్గా చూడలేకపోతున్నాం అన్నారు. ఇక టీవీ ఛానెల్స్ గురించి మాట్లాడుతూ..ప్రజల ప్రతిభా ప్రదర్శనకు వేదికగా మారిన డ్యాన్స్ రియాల్టీ షోలు చూస్తే హేమకు ఆశ్చర్యమేస్తుంది. అదే తరహాలో ఏదైనా కార్యక్రమం అదీ పూర్తిగా శాస్త్రీయ నృత్యానికి అంకితమైన కార్యక్రమం చేయాలనే ఆలోచనలో ఉంది. భరత నాట్యం, ఒడిస్సీ లాంటి అన్ని రకాల శాస్త్రీయ నృత్య రీతులకు వేదికగా ఒక షో చేయాలంటే నాకెంతో ఇష్టం. కానీ కాలం మారిపోయింది. అలాంటివి చేయటం చాలా కష్టం. టెలివిజన్ ప్రొడ్యూసర్లు సైతం అలాంటి కాన్సెప్ట్‌కు మొగ్గు చూపటంలేదు. ఒక్క టివీ చానల్ కూడా నాకు మద్దతు ఇవ్వటంలేదు అన్నారామె.


Click it and Unblock the Notifications











