This Week Movies Releases: బాక్సాఫీస్ వద్ద 8 సినిమాల సందడి.. మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారు?

ఈవారం సినీ ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 సినిమాలు ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ ఎనిమిది సినిమాల్లో చాలామంది ఆ రెండు సినిమాలపైనే ఫోకస్ చేశారు. ఇక ఈ సినిమాల్లో రెండు రీ రిలీజ్ మూవీస్ ఉన్నాయి. ఈ ఎనిమిది సినిమాల సెన్సార్ రిపోర్ట్ రన్ టైం వంటి వివరాలను తెలుసుకుందాం.

చివరి వారంలో 8 సినిమాలు..: ప్రతివారం సరికొత్త సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ వారం థియేటర్లోకి ఎనిమిది సినిమాలు రాబోతున్నాయి. ఇక ఈ సంవత్సరానికి మొదటి ఆరు నెలలు ఈ వారంతో ముగియనుంది. ఈ చివరి వారంలో ఎవరు బాక్సాఫీస్ వద్ద నిలుస్తారో చూడాలి ఇక.

 This Week Movies in Theaters:

పాన్ ఇండియా సినిమా స్పై: యంగ్ హీరో నిఖిల్ చేస్తున్న పాన్ ఇండియా చిత్రం స్పై. ఇక ఈ సినిమా సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ ఎడిటర్ బిహెచ్ గ్యారీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇవ్వగా.. రెండు గంటల 15 నిమిషాలు నిడివి ఉంది.

స్పైతో పోటీగా సామజవరగమన..: ఈ పాన్ ఇండియా చిత్రానికి పోటీగా టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు సామజవరగమన అనే సినిమాతో రాబోతున్నాడు. వివాహ భోజనంబు డైరెక్టర్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇప్పటికే విడుదలైన ప్రీమియర్ షోలు చూసిన మీడియా ప్రతినిధులు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు.

 This Week Movies in Theaters:

ఇండియానా జోన్స్ 5: హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాల్లో ఒకటి ఇండియానా జోన్స్. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్టే. ఇప్పుడు తాజాగా సుమారు 14 ఏళ్ల తర్వాత ఈ సిరీస్ లో వస్తున్న సినిమా ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ 5. ఈ సినిమా జూన్ 30న థియేటర్లలో సందడిచేయనుంది. దీనికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది.

 This Week Movies in Theaters:

చిన్న సినిమాలతో పాటు రీరిలీజ్ మూవీస్: ఇవేకాకుండా మాయపేటిక, నయతారా అండ్ కో, లవ్ యూ రామ్ వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాల ట్రైలర్ లు రిలీజ్ కాగా.. ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు.. రెండు సినిమాలు రీరిలీజ్ కాబోతున్నాయి. అందులో మొదటిది పవన్ కల్యాణ్ తొలిప్రేమ. ఈ సినిమా రిలీజ్ అయి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక రెండవది ఈ నగరానికి ఏమైందీ. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X