For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ లుక్కేంటి... షాకిస్తున్నాడు (పోస్టర్స్)

    By Srikanya
    |

    చెన్నె: తెలుగు,తమళ, మళయాళ అని లేదు... అన్ని సినీ పరిశ్రమలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌.. 'ఐ' ( తెలుగు మనోహరుడు). శంకర్‌ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం పోస్టర్ రీసెంట్ గా విడుదల చేసి అందరినీ షాక్ కు గురి చేసారు.

    నటుడు విక్రం ఈ సినిమా కోసం తన శరీరాకృతిని మూడు రకాలుగా మార్చుకున్నారు. ఇందులో విక్రం క్రూరంగా, లవర్‌బాయ్‌ వంటి పలు పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్‌ రవిచంద్రన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'ఆస్కార్‌' విజేత ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. ఇందులో మొత్తం ఎనిమిది పాటలున్నాయి.

    ఆడియో, ట్రైలర్‌ విడుదల కార్యక్రమం రానున్న 15వ తేదీన చెన్నైలో అత్యంత ఘనంగా జరుగనుంది. సినీప్రియులు, మీడియాతోపాటు.. దర్శక హేమాహేమీలందరూ ఈ తరుణం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్‌ గురించి వచ్చిన వార్తలు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కార్యక్రమానికి హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ ష్క్వార్జ్‌నెగ్గర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

    These New Posters For Shankar And Vikram's AI Are Out Of This World

    ఆర్నాల్డ్‌ ష్క్వార్జ్‌నెగ్గర్‌ ఈ రోజు (ఆదివారం) చెన్నై చేరుకోనున్నట్లు సమాచారం. ఇందులో మొత్తం ఏడు పాటలున్నాయి. 'ఎన్నోడు నీ ఇరుందాల్‌..' అనే గీతంలో పూర్తిగా విక్రం మృగంగానే కనిపించనున్నారు. ఈ పాటలోని ఓ చిన్న క్లిప్పింగ్‌నే ప్రస్తుతం ప్రచారచిత్రంగా విడుదల చేశారు.

    English summary
    Vikram's Manoharaudu (Ai) has released the images here to promote their audio launch event on Monday, September 15th, which promises to be quite a shindig.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X