అది ప్రభాస్ బినామీ సంస్థే : దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలుగులో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘మిర్చి' మూవీతో ప్రారంభమైన ‘యూవి క్రియేషన్స్' సంస్థ తర్వాత రన్ రాజా రన్, జిల్, భలే భలే మగాడివోయ్ లాంటి మంచి చిత్రాలను తెరకెక్కించింది. తాజాగా ఈ సంస్థపై తెరకెక్కిన చిత్రం ‘ఎక్స్ ప్రెస్ రాజా'. ఈ సంస్థ అదినేతలు పేరుకు వంశీ, ప్రమోద్ అయినా...... తెర వెనక ఉండి నడిపించేది హీరో ప్రభాసే అనే ప్రచారం చాలా కాలంగా ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా ‘ఎక్స్ ప్రెస్ రాజా' ఆడియో ఫంక్షన్లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు సంచలన క్రియేట్ చేసాయి. ‘మీకందరికీ తెలుసో లేదో యువి క్రియేషన్స్ ప్రభాస్ కు బినామీ బేనర్. అతడిదే ఈ సంస్థ అంటూ వ్యాఖ్యానించారు. మరి దిల్ రాజు ఇలా ఎందుకు మాట్లాడారో తెలియదు కానీ ఫిల్మ నగర్లో హాట్ టాపిక్ అయింది. మొత్తానికి జనాల్లో ఉన్న అనుమానాలను క్లారిఫై చేసాడు దిల్ రాజు.

వంశీ, ప్రమోద్ ల గురించి మాట్లాడుతూ...నన్ను స్ఫూర్తిగా తీసుకుని ఈ ఇద్దరూ నిర్మాతలయ్యారు. కానీ నిర్మాతలవడం గొప్ప కాదు. మంచి సినిమాలు తీయడం ముఖ్యం. యువి క్రియేషన్స్ లో వస్తున్న సినిమాలు చూస్తుంటే ఇప్పడు ఈ నిర్మాతలిద్దరూ నాకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మాలాంటి సీనియర్ నిర్మాతలు మొనాటనీలో వెళ్లిపోతుంటే వాళ్లు కొత్త తరహా సినిమాలు చేస్తున్నారు. నేనే వాళ్ల నుంచి నేర్చుకోవాలి అని దిల్ రాజు వ్యాఖ్యానించారు.
‘ఎక్స్ ప్రెస్ రాజా' మూవీ వివరాల్లోకి వెళితే ఈ చిత్రంలో శర్వానంద్, సురభి, ఊర్వ హరీష్ ఉత్తమన్, పోసాని, సూర్య, నాగినీడు, బ్రహ్మాజీ, సుప్రీత్, సప్తగిరి, ప్రభాస్ శీను, శకలక శంకర్, ధనరాజ్ తదిరులు నటించారు. సాహిత్యం: భాస్కరభట్ల, శ్రీమణి, డాన్స్:రాజ సుందరం, విశ్వ, రఘు, ఫైట్స్: స్టంట్స్ జాషువా, మ్యూజిక్, ప్రవీష్ లక్కరాజు, సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, ఎడిటర్: సత్య.జి, నిర్మాతలు: వంశీ, ప్రమోద్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: మేర్లపాక గాంధీ.


Click it and Unblock the Notifications











