బాలకృష్ణ ఇంట్లో చోరీకి ప్లాన్ చేసిన ఘరానా దొంగ, పాపులర్ అయ్యేందుకేనంట!
సినిమా రంగంలో కానీ, ఇతర రంగాల్లో ఉన్న కొందరు ప్రజల్లో బాగా ఫేమస్ అవ్వాలని, తమ పేరు మీడియా మార్మోగిపోవాలని ఆశపడుతుంటారు. అందు కోసం కష్టపడి పనిచేయడమో, సంచలనాలు క్రియేట్ చేయడమో లేక ఎవరూ ఊహించని, ఆశ్చర్య పరిచే నిర్ణయాలు తీసుకోవడం లాంటి చర్యలకు పాల్పడటం చేస్తుంటారు. అయితే తాజాగా ఓ ఘరానా దొంగ కూడా తాను మరింత ఫేమస్ అయ్యేందుకు నటుడు నందమూరి బాలకృష్ణ ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్లాన్ చేశాడు. అంతా అనుకున్నట్లు జరిగితే అతడి పేరు మీడియాలో మార్మోగిపోయేది. కానీ బ్యాడ్ లుక్ అంతకు ముందే పోలీసులకు పట్టుబడ్డాడు.

బాలయ్య ఇంట్లో చోరీ ప్లాన్ చేశాడు
కర్రి రాజేష్ అలియాస్ సత్తిబాబు, అలియాస్ బుజ్జి అనే ఘరానా దొంగ ఇటీవల బెంగుళూరులో దొంగతనం చేసి పట్టుబడ్డాడు. అయితే అతడు పట్టుబడి ఉండక పోతే.... నెక్ట్స్ దొంగతనం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని బాలయ్య ఇంట్లో జరిగేదంట. ఈ విషయాన్ని పోలీసులు స్వయంగా వెల్లడించారు.

పెద్ద దొంగగా పాపులర్ అయ్యేందుకేనంట
బెంగుళూరులో పట్టుబడ్డ కర్రి రాజేష్‌ను హైదరాబాద్ పోలీసులు వెళ్లి విచారించారు. ఈ సందర్భంగా అతడు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని బాలయ్య ఇంట్లో దొంగతనం ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. బాలయ్య ఇంటినే ఎందుకు ఎంచుకున్నావంటే.... ఆయన పెద్ద హీరో కాబట్టి అక్కడ దొంగతనం చేస్తే పాపులర్ అవ్వొచ్చని స్కెచ్ వేసినట్లు వెల్లడించారట.

గతంలో అనేక దొంగతనాలు
గతంలో కర్రి రాజేష్ హైదరాబాద్‌లోని చాలా మంది ప్రముఖుల ఇంట్లో దొంగతనాలు చేశారు. అయితే సినిమా యాక్టర్ల ఇళ్లలో మాత్రం చేయలేదు. పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లడం, మళ్లీ తిరిగొచ్చి మళ్లీ అదే పని చేయడం అతడికి అలవాటు అని పోలీసులు వెల్లడించారు.

బాలయ్య ఫ్యాన్స్ ఆశ్చర్యం
బాలయ్య ఇంట్లో దొంగతనం ప్లాన్ చేశారని, అది కూడా పాపులర్ అయ్యేందుకే ఇలా ఒక దొంగ పథకం రచించాడని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్య పోతున్నారు. బాలయ్య సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన తన తండ్రి జీవితంపై తెరకెక్కుతున్న బయోపిక్ ‘ఎన్టీఆర్'లో నటిస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్ చేయడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడు.


Click it and Unblock the Notifications











