హౌస్‌ఫుల్ బోర్డులతో వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి వసూళ్లు.. రాత్రికి రాత్రే కలెక్షన్స్ చోరీ!

టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పండగ సీజన్లో ఏ సినిమా అయినా సరే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఇక ఈసారి మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ నటించిన మాస్ కమర్షియల్ సినిమాలు కూడా ఊహించని స్థాయిలో వసూళ్లను అందుకున్నాయి. అయితే పండుగ రోజు ఈ రెండు సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ దొంగలు ఎత్తుకుపోయిన సంఘటన అందరికీ ఆశ్చర్యాన్ని కలుగజేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

చిరు, బాలయ్య బాక్సాఫీస్ రికార్డులు

చిరు, బాలయ్య బాక్సాఫీస్ రికార్డులు

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో సంక్రాంతి ఫెస్టివల్ లో ఒకేసారి విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి.

ఒక విధంగా నందమూరి బాలకృష్ణ 100 కోట్లతో మొదటిసారి రికార్డు క్రియేట్ చేయగా మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా మరోసారి బాక్సాఫీస్ వద్ద సెంచరీ రికార్డును అందుకున్నాడు.

ఫెస్టివల్ హిట్స్

ఫెస్టివల్ హిట్స్

ఇక ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకోవడంతో ఇరు వర్గాల అభిమానులు కూడా ఎంతగానో సంబరాలు చేసుకున్నారు. థియేటర్స్ వద్ద ఇంకా పండగ వాతావరణం కనిపిస్తోంది. రెండు సినిమాలకు మొదట కొంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ అయితే అస్సలు తగ్గడం లేదు. ఓవర్సీస్ లో కూడా రెండు సినిమాలు మంచి వసూళ్ళను అందుకుంటున్నాయి.

బాక్సాఫీస్ చోరీ

బాక్సాఫీస్ చోరీ

ఫెస్టివల్ లో మూడు రోజులు కూడా సినిమాలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన అంశం కూడా వైరల్ గా మారింది. రెండు సినిమాలకు సంబంధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం ఈ న్యూస్ మీడియాలో వైరల్ గా మారింది.

సెలవు కావడంతో..

సెలవు కావడంతో..

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని శ్రీ లక్ష్మీ థియేటర్లో దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా బ్యాంకులు మూడు రోజుల సెలవు కావడంతో మేనేజర్ నగదును థియేటర్ లోని లాకర్లో ఉంచడం జరిగింది. వాల్తేరువీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల మూడురోజులు కలెక్షన్ అందులోనే ఉంచారు. ఇకసోమవారం రోజు చోరీ చేసి డబ్బులు ఎత్తుకెళ్లారు.

తెలిసిన వారే..?

తెలిసిన వారే..?

థియేటర్ మేనేజర్ వెంటనే పొన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక తెలిసిన వారే ఈ దొంగతనం చేసి ఉంటారు అని చాలా రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇంకా నిజానిజాలు తెలుసుకునేందుకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇక వాల్తేరు వీరయ్య మంగళవారం రోజు బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అందుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X