»   » సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ రచ్చ రచ్చ చేసారు (ఫోటోస్)

సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ రచ్చ రచ్చ చేసారు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై సునీల్‌ రెడ్డి దర్శకత్వంలో సి.రోహిణ్‌కుమార్‌ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'తిక్క'. లారిస్సా బోనేసి, మన్నార్‌ చోప్రా హీరోయిన్స్‌ గా నటించారు. ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆగస్టు 13న రిలీజ్ కాబోతోంది.

సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్ల జోరు పెంచారు. తాజాగా సాయి ధరమ్ తేజ్, లారిస్సా బోనేసి కలిసి హైదరాబాద్ రేడియో సిటీ స్టేషన్ లో హల్ చల్ చేసారు. చిత్ర బృందం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. రేడియో సిటీ సిబ్బందితో కలిసి సాయి ధరమ్ తేజ్, లారిస్సా స్టెప్పులేసి సందడి చేసారు.


ఇటీవల విడుదలైన 'తిక్క' టీజర్‌కు, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. యాక్షన్ .. కామెడీ .. లవ్ కి సంబంధించిన దృశ్యాలతో ట్రైలర్ ను కట్ చేశారు. యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఈ టీజర్ వుంది. ఈ టీజర్, ట్రైలర్ ద్వారా సినిమాపై అంచనాలు పెరిగేలా చేయాలనే టీమ్ ప్రయత్నం కొంతవరకూ ఫలించిందనే చెప్పాలి. ఆగస్టు 13న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.


స్లైడ్ షోలో ఫోటోస్..


రేడియో సిటీ..

రేడియో సిటీ..

రేడియో సిటీ స్టేషన్లో సాయి ధరమ్ తేజ్..


ఏర్పాట్లు చూసి షాకై..

ఏర్పాట్లు చూసి షాకై..

రేడియో సిటీ వారు చేసిన ఏర్పాట్లు చూసిన షాకైన సాయి ధరమ్ తేజ్ ఇలా ఫేస్ పెట్టేసాడు.


నా వల్ల కాదు

నా వల్ల కాదు

ఇవన్నీ నాకు ఒక్కడికేనా..? నా వల్ల కాదు బాబోయ్ అంటూ...


అబ్బో..

అబ్బో..

రేడియో సిటీ వారు ఏర్పాట్లు మామూలుగా చేయలేదుగా...


మీరూ ఓ స్టెప్పేయండి..

మీరూ ఓ స్టెప్పేయండి..

మీరూ ఓ స్టెప్పేయండి అంటూ సాయి ధరమ్ తేజ్, సారిసా బోనేసిలను ముగ్గులోకి లాగుతూ..


తప్పదుగా..

తప్పదుగా..

ఇక్కడిదాకా వచ్చాక తప్పదుగా అన్నట్లు ఇద్దరూ కాలు కదపక తప్పలేదు.


ఏం జరిగిందో?

ఏం జరిగిందో?

మరి ఏం జరిగిందో? ఏంటో....సాయి ధరమ్ తేజ్ నోటికి అలా చేయి అడ్డం పెట్టేసి...


ఉత్సాహం

ఉత్సాహం

మధ్యలో ఉన్న వ్యక్తి ఉత్సాహం చూసారుగా, గురుడు చాలా ఫాస్టుగా ఉన్నాడు.....


డాన్స్ స్టార్

డాన్స్ స్టార్

ఈయన ఎవరోగానీ సాయి ధరమ్ తేజ్ కంటే డాన్స్ బాగా ఇరగ దీస్తున్నాడే!


సిగ్గు ఎక్కువే..

సిగ్గు ఎక్కువే..

సాయి ధరమ్ తేజ్ కు సిగ్గు కాస్త ఎక్కువే...


సీరియస్ గా స్టెప్పుల్లేద్దాం..

సీరియస్ గా స్టెప్పుల్లేద్దాం..

కామెడీ స్టెప్పులు ఆపేసి కాస్త సీరియస్ గా స్టెప్పులేద్దాం అనేలా...


అదరగొట్టాడు

అదరగొట్టాడు

సాయి ధరమ్ తేజ్ డాన్స్ అదరగొట్టాడంతే...


అమ్మాయి అలసిపోయినట్లుందే..

అమ్మాయి అలసిపోయినట్లుందే..

డాన్స్ చేసి చేసి ఈ అమ్మాయి చాలా అలిసిపోయినట్లుంది కదూ...


జోడీ సూపర్బ్

జోడీ సూపర్బ్

ఈ జోడీ సూపర్బ్ గా ఉంది... ఇక సినిమాలో ఎంత బాగా ఉంటారో


కొడుతున్నారా ఏంటి?

కొడుతున్నారా ఏంటి?

రేడియో సిటీ వారు ఏం చేసారో ఏంటో... కొంపతీసి కొట్టట్లేదుగా?


చిట్ చాట్

చిట్ చాట్

రేడియో సిటీ శ్రోతలతో హీరో హీరోయిన్ చిట్ చాట్.


చాలా అందంగా ఉన్నావ్

చాలా అందంగా ఉన్నావ్

హీరోయిన్ ను చూసిన వారంతా చాలా అందంగా ఉన్నావ్ అంటూ పొగిడేస్తున్నారు.


మరోసారి తనివితీరా..

మరోసారి తనివితీరా..

లారిసాను మరోసారి కనువిందుగా చూడండి మరి!


కేక్ కటింగ్

కేక్ కటింగ్

రేడియో సిటీ అడ్డాల్లో సాయి ధరమ్ తేజ్, లారిసా కేక్ కటింగ్.


వద్దు బాబూ..

వద్దు బాబూ..

అమ్మో ఇంత పెద్ద కేకు ముక్క తింటే లావెక్కిపోనూ...English summary
Thikka movie stars Sai Dharam Tej and Larissa Bonesi Visited Radio City FM Today in Hyderabad. Thikka is 2016 Telugu film, produced by Dr. Rohin Reddy under Sri Venkateswara Movie Makers banner and directed by Sunil Reddy. Starring Sai Dharam Tej, Larissa Bonesi, Mannara in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu