For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనుష్క-విరాట్ కోహ్లి వివాహంపై.... వారి మాజీ లవర్స్ ఎలా రియాక్టయ్యారో తెలుసా?

  By Bojja Kumar
  |

  బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మూడుముళ్ల బంధంతో ఏకమయ్యారు. సోమవారం వీరి వివాహం ఇటలీలో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొద్ది మంది అతిథుల మధ్య పెళ్లి వేడుక జరిగింది. త్వరలో ఢిల్లీ, ముంబైలో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది.

  అనుష్క ఎక్స్ లవర్ రణవీర్, కోహ్లిని ప్రేమించిన ఇంగ్లండ్ అమ్మాయి

  అనుష్క ఎక్స్ లవర్ రణవీర్, కోహ్లిని ప్రేమించిన ఇంగ్లండ్ అమ్మాయి

  కోహ్లి కంటే ముందు అనుష్క బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌‌ను ప్రేమించిందని, అతడితో డేటింగ్ చేసిందనే వార్తలు అప్పట్లో వినిపించాయి. అదే విధంగా కోహ్లికి కూడా ఇంగ్లండ్‌కు చెందిన మహిళా క్రికెటర్ ప్రపోజ్ చేసింది. ఇపుడు అనుష్క-కోహ్లి పెళ్లి చేసుకున్న నేపథ్యంలో వారు స్పందించారు.

  కోహ్లికి ప్రపోజ్ చేసిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్

  కోహ్లికి ప్రపోజ్ చేసిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్

  ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు, ఆల్ రౌండర్ డేనియల్ వైట్..... 2014లో కోహ్లికి ప్రపోజ్ చేసింది. ‘కోహ్లి నన్ను పెళ్లి చేసుకో' అంటూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ సంవత్సరం ఆమెకు విరాట్ ఓ బ్యాట్ కూడా బహుమతిగా ఇచ్చారు.

  కోహ్లిని విష్ చేసిన డేనియల్ వైట్

  కోహ్లిని విష్ చేసిన డేనియల్ వైట్

  తాజాగా విరాట్ కోహ్లి పెళ్లి అనుష్కతో జరిగిన నేపథ్యంలో డేనియల్ వైట్ ట్విట్టర్ ద్వారా విష్ చేశారు. కంగ్రాట్స్ విరాట్ కోహ్లి, అనుష్క అంటూ ట్వీట్ చేశారు.

  అనుష్క మాజీ ప్రేమికుడు రణవీర్ సంగ్

  అనుష్క మాజీ ప్రేమికుడు రణవీర్ సంగ్

  ‘బ్యాండ్ బాజా భారత్' సినిమాలో కలిసి నటించిన అనుష్క శర్మ, రణవీర్ సింగ్ అప్పట్లో ప్రేమలో పడ్డారని, డేటింగ్ చేశారని వార్తలు వచ్చాయి. అప్పట్లో రణవీర్ తన ప్రేమను సీరియస్‌గా తీసుకున్నప్పటికీ అనుష్క విరాట్ కోహ్లి వైపు ఆకర్షితురాలవ్వడంతో లైట్ తీసుకున్నాడని, ఆ తర్వాత అతడు దీపిక పదుకోన్ తో డేటింగ్ చేయడం ప్రారంభించారని వార్తలు వచ్చాయి.

  రణవీర్ సింగ్ స్పందించ లేదు కానీ, లైక్ చేశాడు

  రణవీర్ సింగ్ స్పందించ లేదు కానీ, లైక్ చేశాడు

  అనుష్క, విరాట్ కోహ్లి వివాహం చేసుకోవడంపై రణవీర్ సింగ్ విష్ చేయడం లాంటివి ఏమీ చేయలేదు. అయితే అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసిన పెళ్లి ఫోటోలను అతడు లైక్ చేశాడు.

  అతడిలో అప్పట్లో బాధ ఉండేది

  అతడిలో అప్పట్లో బాధ ఉండేది

  అప్పట్లో అనుష్కను రణవీర్ సింగ్ చాలా ప్రేమించాడని, అయితే అనుష్క మాత్రం అతడి ప్రేమను నిరాకరించిందని టాక్. ఈ విషయంలో అప్పట్లో రణవీర్ సింగ్ బాధ పడ్డాడనని, ఈ నేపథ్యంలో అనుష్క-విరాట్ పెళ్లిపై అతడు స్పందించక పోవచ్చని అంతా భావించారు. అయితే పెళ్లి ఫోటోలను అతడు లైక్ చేయడంతో అనుష్కను అతడు ఎప్పుడో తన హృదయం నుండి తీసేశాడని స్పష్టమవుతోంది.

  ఇటలీలో వివాహం అందుకే..

  ప్రపంచంలో ఎన్నోఅందమైన ప్రదేశాలండగా ఇటలీలోనే ఈ జంట ఎందుకు పెళ్లిచేసుకున్నట్లు? అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇందుకు కారణం ప్రముఖ బాలీవుడ్‌ దర్శక-నిర్మాత, నటి రాణీ ముఖర్జీ భర్త ఆదిత్య చోప్రానేనట. ఆదిత్య.. రాణి ముఖర్జీని 2014లో ఇటలీలోనే పెళ్లి చేసుకున్నారు. అనుష్క విరాట్‌ని పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆదిత్య ఇటలీలో పెళ్లిచేసుకోమని సలహా ఇచ్చారట. భారత్‌లో ఎక్కడ వివాహం చేసుకున్నా మీడియా, అభిమానులు హడావుడి చేస్తారని.. ఇటలీలోఅయితే చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పారట.

  రింగు కోసం మూడు నెలలు

  రింగు కోసం మూడు నెలలు


  పెళ్లి సందర్భంగా అనుష్క వేలికి తొడిగే పర్‌ఫెక్ట్ రింగ్ కోసం విరాట్ కోహ్లి దాదాపు మూడు నెలలు పాటు వెతికాడట. ఇందుకోసం ఆయన చాలా రేర్ డైమండ్ సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియన్ డిజైనర్ దీన్ని మరింత అందంగా తీర్చి దిద్దాడని, ఈ రింగ్ ఖరీదు రూ. 1 కోటి ఉంటుందని సమాచారం.

  English summary
  England women's cricket team all-rounder Danielle Wyatt sent a tweet to Virat Kohli in 2014, and proposed him to marry her with a simple message, "Kholi marry me!!!" The duo have been good friends and earlier this year, Virat gifted her a cricket bat and she shared it on her Twitter handle. Now that Virat Kohli tied the knot to Anushka Sharma, Danielle Wyatt sent out a tweet congratulating the couple and kept it sweet and simple by saying, "Congratulations imVkohli & AnushkaSharma." Check out Virat and Danielle's picture below!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X