»   » జూ ఎన్టీఆర్ స్పీచ్ ఎడిట్ చేసారా? మాటీవీ వీడియోపై దుమారం!

జూ ఎన్టీఆర్ స్పీచ్ ఎడిట్ చేసారా? మాటీవీ వీడియోపై దుమారం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టెంపర్ చిత్రంలో ఔట్ స్టాండిగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన జూ ఎన్టీఆర్....ఇటీవల సిని'మా' అవార్డుల కార్యక్రమంలో బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని మాటీవీలో ఆదివారం ప్రసారం చేసారు. చిరంజీవి, నాగార్జున చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్న జూ ఎన్టీఆర్...వారిని బాబాయ్ అని సంబోధిస్తూ తన హ్యాపీ‌నెస్ వ్యక్తం చేసారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ....'చిరంజీవి గారు, నాగార్జున గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషం ఉంది. మేం ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నా చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నందమూరి తారక రామారావు గారు, ఎఎన్ఆర్ గారు, కృష్ణ గారు మా జనరేషన్ కు ఇన్స్‌స్పిరేషన్, వారి ఆశీర్వచనాలు మాపై ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ వ్యాఖ్యానించారు.

అయితే మాటీవీలో ఆదివారం ప్రసారం అయిన వీడియోలో మాత్రం చిరంజీవి, నాగార్జున పేర్ల కంటే ముందు సీనియర్ ఎన్టీఆర్, ఎఎన్ఆర్ పేర్లు వినిపించాయి. మాటీవీ వారు ఈ వీడియోను ఎడిట్ చేసి ప్రసారం చేసారని సోషల్ మీడియాలో కొందరు అభిమానులు దుమారం రేపారు. వారు పోస్టు చేసిన వీడియోను మీరు ఇక్కడ చూడొచ్చు.

పలువురు ఫ్యాన్స్ ఎన్టీఆర్ మాట్లాడిన రియల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసారు. మరి నిజంగా మాటీవీ వారు ఎన్టీఆర్ స్పీచ్ ఎడిట్ చేసి రిలీజ్ చేసారా? ఒక వేళ చేస్తే ఎందుకలా చేయాల్సి వచ్చింది అనే అంశంపై సోషల్ మీడియాలో రకరకాల డిబేట్లు జరుగుతున్నాయి.

English summary
Jr NTR received the Best Actor Award for his outstanding performance in Temper at CineMAA Awards, which was aired on TV on Sunday night. However, his speech was slightly modified by MAA TV and they placed the names of NTR & ANR before Chiranjeevi and Nagarjuna. This came as a real shocker when a fan-boy noticed the change and posted the original speech on social networking sites.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu