'వినయ విధేయ రామ' చేయను అనే చెప్పాడు.. కానీ బోయపాటి పట్టుబట్టాడు!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన వినయ, విధేయ రామ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి దర్శత్వంలో వచ్చిన ఈ మాస్ ఎంటర్ టైనర్ కు ప్రేక్షలకులు, క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. రాంచరణ్ కు జోడిగా ఈ చిత్రంలో కైరా అద్వానీ నటించింది. వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటించగా, స్నేహ, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రల్లో నటించారు. ముందు నుంచి ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ పాత్ర ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొని ఉంది. ఎందుకంటే వివేక్ ఒబెరాయ్ బాలీవుడ్ లో క్రేజీ నటుడు. తెలుగులో రక్త చరిత్ర లాంటి చిత్రాల్లో నటించాడు. ముందుగా ఈ చిత్రంలో నటించేందుకు వివేక్ ఒబెరాయ్ ఆసక్తి చూపలేదట.

చేయను అనే చెప్పాడు
వినయ విధేయ రామ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ ని నటింపజేసేందుకు బోయపాటి అతడిని కలిశాడట. వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు. వివేక్ ఒబెరాయ్ ని తప్ప మరో నటుడిని బోయపాటి ఈ పాత్రలో ఊహించుకోలేక పోయారట. దీనితో వివేక్ కి కథ మొత్తం వివరించి విలన్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో చెప్పాడు. ఆ తర్వాతే వివేక్ కన్విన్స్ అయ్యాడట.

విలన్‌గా అద్భుత నటన
వివేక్ ఒబెరాయ్ గతంలో క్రిష్ 3, వివేగం చిత్రాల్లో విలన్ గా నటించాడు. ఆ చిత్రాల్లో విలన్ రోల్ లో క్రిష్ నటనకు అద్భుతమైన స్పందన వచ్చింది. బోయపాటి ప్రతి చిత్రంలో విలన్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుంది. ఈ చిత్రంలో కూడా వివేక్ ఒబెరాయ్ ని పవర్ ఫుల్ గా చూపించాడట. మిశ్రమ స్పందన వస్తున్న నేపథ్యంలో వినయ విధేయ రామ చిత్రం కమర్షియల్ గా ఏమేరకు విజయం సాధిస్తుందో చూడాలి.

భారీ అంచనాల నడుమ
బోయపాటి, రాంచరణ్ తొలి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ఇది. నిర్మాత డివివి దానయ్య భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ ఎమోషన్, యాక్షన్ ప్రధాన అంశాలుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. చిత్రంలో హింసాత్మక సన్నివేవాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇక కైరా అద్వానీ, రాంచరణ్ డాన్సులకు మంచి స్పందన వస్తోంది.

చాలా రోజుల తర్వాత
సీనియర్ హీరోయిన్ స్నేహ చాలా రోజుల తర్వాత ఓ తెలుగు చిత్రంలో నటించారు. ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ లాంటి హీరోలు కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సంక్రాంతి సీజన్ కావడంతో ఈ చిత్రానికి మంచి వసూళ్లు నమోదవుతాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











