ఇదిగో కాజల్ ఇలా దీపావళి జరుపుకుంది(ఫొటో)
హైదరాబాద్ :మొత్తానికి దీపావళి సందడంతా అమ్మాయిలదే అని మరోసారి తేలిపోయింది. మన హీరోయిన్స్ కూ దీపావళి పండగే ఫేవరెట్. ఈ పండగ రోజు చిచ్చుబుడ్డిలా నవ్వేసి, మతాబులా వెలిగిపోయి...ఇదిగా ఇలా కాజల్ లాగ సెలబ్రెట్ చేసుకున్నారు. కాజల్ తన సోదరి నిషా అగర్వాల్ తో కలిసి దీపావళిని జరుపుకుంటూ ఇలా ఫోజిచ్చింది. ముంబైలోని తన సొంత ఇంట్లో ...తన సొంత వారితో కాజల్ దీపావళిని జరుపుకుంది.
కాజల్ మాట్లాడుతూ.... ''దీపావళి ఓ రంగుల కలలా ఉంటుంది. చిన్నప్పటి నుంచీ దీపావళి అంటే చాలా ఇష్టం. పండుగ ఎప్పుడొస్తుందా? అని ఆశగా ఎదురుచూసేదాన్ని. ఈరోజు పూజలూ, పునస్కారాలూ మమూలే. అయితే నా దృష్టంతా రాత్రి చేయబోయే హంగామాపైనే ఉండేది. మా వీధులన్నీ దీపాల కాంతులతో కళకళలాడిపోతాయి. టపాసుల మోత మోగాల్సిందే. సంబరం అంటే ఏమిటో తెలిపే పండుగ ఇది'' అని చెప్పుకొచ్చింది.

దాంతో బండ్ల గణేష్ కు ఆమె వరస డేట్స్ ఇవ్వటానికి కారణంగా... మధ్య రెమ్యునేషన్ విషయమై కుదిరిన ఒప్పందమే అని చెప్పుకుంటున్నారు. కాజల్ ...రెమ్యునేషన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని, అదే ఆమె బలహీనత,బలం అని అంటారు. ఆ పాయింట్ మీద గణేష్ వర్కువుట్ చేసాడని అంటున్నారు. బయిట ఏ నిర్మాత ఆఫర్ చేయని విధంగా గణేష్ ఆమెకు రెండు కోట్లు ఇస్తున్నారని, అందుకే ఆమె వెంటనే సై అందని సమాచారం.
''పని.. పని.. పని.. జీవితమంతా ఇలాగే ఉంటే ఇక ఆనందం ఎక్కడుంటుంది. అందుకే చిత్రీకరణలో ఎంత బిజీగా ఉన్నా.. ఓ చల్లని సాయంత్రం అలా స్నేహితులతో బయటకు వెళ్లేందుకు ప్రాధాన్యమిస్తాను. వాళ్లతో మాట్లాడుకుంటూ.. చల్లని పళ్ల రసం తాగుతూ ఉంటే ఆ ఆనందమే వేరు'' అంటోంది కాజల్


Click it and Unblock the Notifications











