మాటల్లేవ్.. ఆ 'నెక్లెస్'లో అనుష్కను చూసి థ్రిల్, ఎవరిచ్చి ఉంటారు?
సెలబ్రిటీలు ఏం చేసినా.. చేయకున్నా.. అదో పెద్ద వార్తే. ప్రొఫెషన్‌లో ఏం చేస్తున్నారన్నది కాదు.. బయట జీవితంలో ఏం చేస్తున్నారన్న దానిపై కూడా మీడియాకు, అభిమానులకూ చాలా ఇంట్రెస్ట్.
మామూలుగానే సెలబ్రిటీలను ఓ కంట కనిపెట్టే మీడియా.. ఇక వాళ్లకు సంబంధించిన స్పెషల్ ఏమైనా ఉంటే వదులుతుందా?.. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పెళ్లి విశేషాలపై మీడియా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో అనుష్క శర్మ ధరించిన ఓ నెక్లెస్ గురించి ఆసక్తికర కథనం తెర పైకి వచ్చింది.

రిసెప్షన్ పార్టీ:
విదేశాల్లో పెళ్లి, హనీమూన్ ముగించుకుని ఇండియా చేరుకున్న కోహ్లి జంట.. దేశ రాజధాని ఢిల్లీలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ప్రముఖులను ఆహ్వానించి ఘనంగా ఈ వేడుకను జరుపుకున్నారు. రిసెప్షన్ లో అనుష్క ధరించిన చోకర్ నెక్లస్ సెంటారఫ్ ది ఎట్రాక్షన్‌గా నిలిచింది అంటున్నారు.

సెంటారఫ్ ది ఎట్రాక్షన్.. నెక్లెస్:
రిసెప్షన్ లో అనుష్క ఎరుపు రంగు చీర, చోకర్ నెక్లస్‌లో ఆకట్టుకునేలా కనిపించారు. మీడియా కళ్లన్నీ అనుష్క ధరించిన చోకర్ నెక్లెస్ మీదే పడ్డాయట. దీని ధర దాదాపు రూ.25లక్షల నుంచి రూ.30లక్షల వరకు ఉండవచ్చునని తెలుస్తోంది.

ఎవరిచ్చారు?:
రిసెప్షన్ లో అనుష్క శర్మ ధరించిన చోకర్ నెక్లెస్ విరాట్ కోహ్లి ప్రెజెంట్ చేసి ఉంటాడా?.. లేక అనుష్కనే డిజైన్ చేయించుకుందా? అనేదానిపై కూడా మీడియా, అభిమానులు ఆరా తీస్తున్నారు. ఏదైతేనేం మొత్తానికి ఆ నెక్లెస్ చాలామందిని ఆకర్షించేసింది.

సబ్యసాచి డిజైనర్:
విరుష్క దంపతుల పెళ్లి కోసం దుస్తులు డిజైన్ చేసిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి.. రిసెప్షన్ కు కూడా దుస్తులు డిజైన్ చేశారు. రిసెప్షన్ లో అనుష్క ధరించిన చీర ఎరుపు రంగు బెనారసీ అని .. బెంగాళీ మహిళలు పెళ్లి వేడుకుల్లో ఈ దుస్తులను ధరిస్తారని తెలిపారు.

రెండో విందు ముంబై:
ఢిల్లీలో మొదటి విందు ఏర్పాటు చేసిన ఈ జంట.. ముంబైలో మరో విందు కూడా ఏర్పాటు చేయనున్నారు. డిసెంబర్ 26న ఏర్పాటు చేయబోయే ఈ విందు కోసం బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు వచ్చే అవకాశముంది.
ముంబై విందు అనంతరం వీరిద్దరు వీరిద్దరూ దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరనున్నారు. అక్కడే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. ఆ తర్వాత జనవరి నుంచి 'పరి', 'సూయీ ధాగా' చిత్రాల్లో అనుష్క నటించనున్నారు.


Click it and Unblock the Notifications











