»   » మోదీ నిర్ణయంపై మహేష్ స్పందించారు, లేటైనా లేటెస్ట్ గా

మోదీ నిర్ణయంపై మహేష్ స్పందించారు, లేటైనా లేటెస్ట్ గా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిన్నటి వరకు చెలామణిలో ఉన్న రూ. 1000, 500 నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బ్లాక్ మనీ, అవినీతి సొమ్ము, దొంగనోట్ల చెలామణిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మోడీ నిర్ణయాన్ని హర్షిస్తూ సినీ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, కరణ్ జోహార్ తదితరులు ట్వీట్స్ చేసారు. ఈ ట్వీట్లపై స్వయంగా నరేంద్ర మోడీ స్పందించారు. వారికి పేరు పేరునా ట్విట్టర్ ద్వారా రిప్లై ఇచ్చారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా తన దైన శైలిలో ఈ విషయమై ట్విట్టర్ లో స్పందించారు.

"దేశానికి దేశ ఆర్ధిక వ్యవస్థకు ఒక ఆహ్లాదకరమైన మార్పును తీసుకువచ్చారు.. ప్రజల మనిషి - ప్రజల కొరకు - ప్రజల చేత ఎన్నుకోబడిన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ కు సెల్యూట్" అంటూ మహేష్ బాబు స్పందించిన తీరు ఆయన అబిమానులను ఆనందపరుస్తోంది.

మరో ప్రక్క ఎంతో సాహసోపేతమైన ఈ నిర్ణయం తీసుకున్న మోడీపై సాధారణ ప్రజానీకమంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇందుకు మన హీరోలు, హీరోయిన్స్ సైతం జై కొట్టడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అల్లు అర్జున్, సిద్ధార్థ్ , రజనీకాంత్, కమల్ హాసన్, లాంటి స్టార్స్‌తో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు చెందిన చాలామంది మోడీ నిర్ణయాన్ని సమర్ధిస్తూ వస్తున్నారు.

మిగతా సినిమావాళ్లు ఈ నిర్ణయాన్ని ఎలా స్వాగతించారో క్రింద చూద్దాం...

నోట్ల రద్దుపై అల్లు అర్జున్ ఇలా

నోట్ల రద్దు విషయమై వెంటనే అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా ఈ క్రింద విధంగా స్పందించారు. మీరు ఆయన ఏమి అన్నారో క్రింద చూడవచ్చు.

సిద్దార్ద ఏమంటారంటే..

ప్రధాని ఊహించని విధంగా రద్దు చేసిన నోట్ల విషయమై హీరో సిద్దార్ద తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా వెంటనే స్పందించారు. ఆయన ఏమి చెప్పారంటే... అనేది మీరు ఈ క్రింద చూడవచ్చు.

కమల్ ఏం చెప్పారంటే

కమల్ హాసన్ ఈ నోట్ల రద్దు విషయమై ఈ రోజు ఉదయం ట్విట్టర్ లో స్పందించారు. ఆయన ప్రధాని మోడని మెచ్చుకుంటూ ట్వీట్ చేసారు.

వర్మ ఏమంటారంటే

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ .... ఎప్పటికప్పుడు ఈ మధ్యన పొలిటికల్ ఇష్యూలపై ట్విట్టర్ లో స్పందిస్తున్నారు. ఆయన ఈ విషయమై ఏం చెప్పారో చూడండి.

తమిళ హీరో ధనుష్ ఇలా..

ప్రముఖ తమిళ హీరో ధనుష్...నోట్ల రద్దు, మార్పిడి విషయమై మోడిని ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయన ఏమన్నారో ట్వీట్ లో చూడండి.

నోట్ల రద్దు, మార్పిడిపై ప్రకాష్ రాజ్ ఇలా

ప్రముఖ నటుడు ప్రకాష్ వెంటనే ఈ విషయమై స్పందించి తన అభిప్రాయం తెలియచేసారు. సామాన్యులకు ఎవరూ ఈ విషయమై కంగారుపడాల్సిన అవసరం లేదన్నారు.

హీరో నిఖిల్ ఏం ట్వీట్ చేసారంటే

ఈ విషయమై హీరో నిఖిల్...వెంటనే స్పందించారు. మీకు నా సెల్యూట్ అంటూ మోడని మెచ్చుకున్నారు. మేము మీ రూల్స్ ని ఫాలో అవుతాం అన్నారు.

దర్శకుడు హరీష్

ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్...ఈ విషయమై ట్విట్టర్ లో స్పందిస్తూ..రెండున్నర ఏళ్ల నరేంద్రమోడీ పాలనలో ఇదొక అదిరిపోయే ఇంట్రవెల్ బ్యాంగ్ అన్నారు.

నటుడు వెన్నెల కిషోర్ ఈ విషయమై

కమిడయన్ వెన్నెల కిషోర్ ఈ విషయమై ట్వీట్ చేస్తూ ఎప్పటిలాగే కామెడీ చేసారు. దాన్ని మీరు ఈ క్రింద చూడవచ్చు.

సంగీత దర్శకుడు తమన్

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ..ఈ విషయమై ట్వీట్ చేస్తూ మోడీ అవినీతిపై పోరాడుతున్నారని మెచ్చుకున్నారు. ఇంకా ఆయన ఏమన్నారో ట్వీట్ చూడండి.

నిర్మాత మధుర శ్రీధర్ మాటల్లో

ప్రముఖ నిర్మాత మధురా శ్రీధర్ ..ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయానికి హర్షం వెల్లబుచ్చారు. ఇది ఓ హిస్టారిక్ డెసిషన్ గా అభివర్ణించారు. ఆయన ఇంకా ఏమన్నారో చూడండి.

నిర్మాత కరణ్

ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ విషయంలో నరేంద్ర మోడీ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు ‘ఇది నిజంగా గొప్ప నిర్ణయం. మోదీ దుమ్ము దులిపేశారు'- కరణ్‌ జోహార్‌ .

సౌతిండియా సూపర్ స్టార్

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ విషయమై వెంటనే స్పందించారు. ఆయన తన ట్విట్టర్ ఎక్కౌంట్ లో ఈ క్రింద విధంగా రాసారు..‘హ్యాట్సాఫ్‌ నరేంద్ర మోదీ గారు. కొత్త భారతదేశం పుట్టింది. జైహింద్‌'-రజనీకాంత్‌

నటి సోనాక్షి

బాలీవుడ్ ప్రముఖ నటి..సోనాక్షి సిన్హా..ఈ నోట్ల రద్దు వ్యవహారంపై ఆనందం వ్యక్తం చేస్తూ..‘అమెరికాలో ఓట్ల కౌంటింగ్‌. భారత్‌లో నోట్ల కౌంటింగ్‌'- సొనాక్షి సిన్హా అన్నారు.

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క ఇలా

‘ఓ చక్కటి దేశాన్ని తయారుచేయడానికి మోదీ మంచి నిర్ణయం తీసుకున్నారు. మనమంతా ఒక్కటై నల్లధనాన్ని అరికట్టడంలో ప్రభుత్వానికి సాయం చేయాలి'- అనుష్క శర్మ అని అన్నారు.

కిస్సుల కింగ్ ఏమన్నారంటే

బాలీవుడ్ కిస్సుల వీరుడు ఇమ్రాన్ హష్మి ఈ విషయమై తన ఆనందాన్ని వెళ్లభుచ్చారు. ‘అవినీతిని నిర్మూలించడానికి మోదీ తీసుకున్న నిర్ణయం అభినందనీయం'-ఇమ్రాన్‌ హష్మి అన్నారు.

దొంగలించా అమెరికా

‘మీ థండర్‌ను మేము దొంగిలించాం అమెరికా. మోదీ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక్క దెబ్బతో నల్లధనాన్ని నిర్మూలిస్తున్నారు'- అని బాలీవుడ్ హీరోయిన్ అదితిరావ్‌ హైదరి అన్నారు.

రిషీ ఏమన్నారంటే

ఎప్పటిలాగే రిషీకపూర్ విభిన్నంగా స్పందించారు. ఆయన ఏమన్నారో ఈ క్రింద ట్వీట్ లో మీరు చూడండి.

హీరో అర్జున్ కపూర్ ఇలా...

బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ నోట్ల రద్దు విషయమై స్పందిస్తూ నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకున్నారు.

కొంతమంది లాస్

కొంతమంది ఈ విషయంలో లాస్ అవ్వొచ్చేమో కానీ, చాలా మంది లాభపడతారు. చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఇది 9/11 అన్నారు.

హీరోయిన్ ఇలా..

బాలీవుడ్ లోనూ,టాలీవుడ్ లోనూ వరసగా సినిమాలు చేస్తున్న పూజ హేడ్గే ఈ విషయం తెలిసిన వెంటనే తన ట్విట్టర్ లో ఇలా స్పందించారు.

మాస్టర్ స్ట్రోక్

అమెరికా వోట్లు లెక్కపెడుతూంటే...ఇండియా నోట్లు లెక్కపెడుతూంటుంది. ఇది మాస్టర్ స్ట్రోక్...అవినీతిపై అంటూ రక్తచరిత్ర హీరో స్పందించారు.

దర్శకుడు ఇలా

వాస్తవిక చిత్రాలతో పేరు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు మధూర్ బండార్కర్ ఇలా తనదైన శైలిలో ప్రధానిపై ప్రశంసలు వర్షం కురిపించారు.

తెలుగు హీరో రామ్

స్టార్ హీరోరామ్ తన ట్విట్టర్ పేజీలో నోట్ల రద్దు విషయమై ట్వీట్ చేసారు. ఇండియాను లోపలనుంచి క్లీన్ చేయటంగా ఆయన అభివర్ణించారు.

పింక్ కలర్ లో ..

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ లో ఈ క్రింద విధంగా స్పందించారు. తన సినిమా పింక్ ని గుర్తు చేసుకుంటూ కొత్త రెండువేల నోటుకు ముడిపెట్టారు.

షాకింగ్ సర్పైజ్

తెలుగు,తమిళ భాషల్లో తన డాన్స్ లతో , ఐటం సాంగ్ లతో దుమ్మురేపుతున్న రాయ్ లక్ష్మి..ఈ నోట్ల రద్దు విషయమై ఇలా స్పందించారు.

రెస్పెక్ట్ అంటూ

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ విషయంలో నరేంద్ర మోడికి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేసారు. ఆమె ఏమంటారంటే..

English summary
Mahesh Babu tweeted: A refreshing change for our economy & country! Master stroke from the man of the ppl by the ppl for the ppl! Salute you narendramodi sir!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu