twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా భారత దేశం ఇది కాదు.... ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు

    రోజా లాంటి దేశభక్తి సినిమా తోనే తన కెరీర్ మొదలు పెట్టిన రెహమాన్ ఇప్పటికీ తన దేశం అంటే ఉండాల్సినంత గౌరవం తో ఉంటాడు.

    |

    రోజా లాంటి దేశభక్తి సినిమా తోనే తన కెరీర్ మొదలు పెట్టిన రెహమాన్ ఇప్పటికీ తన దేశం అంటే ఉండాల్సినంత గౌరవం తో ఉంటాడు. దేశభక్తిని పెంపొందించే ' వందేమాతరం', ' మా తుజేసలామ్‌' వంటి అద్భుత గీతాలను ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరిచాడు. అయితే అంతటి దేశభక్తుడికీ ఇక్కడనేలకొన్న పరిస్థితులు చిరాకు తెప్పించాయి ఎంతగా అంటే అసలు నాదేశం ఇదీ అని చెప్పుకోలేను అని అనేంతగా....

    ఏఆర్‌ రెహమాన్‌

    ఏఆర్‌ రెహమాన్‌

    ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకత్వం వహించి నిర్మించిన వన్‌ హార్ట్‌ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబయిలో నిర్వహించిన కార్యక్రమంలో జర్నలిస్ట్‌ గౌరీలంకేశ్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేశాడు. కాగా, ఈనెల 5న ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీలంకేశ్‌ బెంగళూర్‌లో దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే.

    గౌరీలంకేష్‌

    గౌరీలంకేష్‌

    గుర్తు తెలియని దుండగులు ఆమెపై కాల్పులు జరిపి పరారయ్యారు. మోడీ పాలనలో మైనారిటీలపై, దళితులపై, మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అక్షర సైనికురాలిగా ఆమె ఉద్యమించారు. మితవాద శక్తులను విమర్శిస్తూ తాను నిర్వహిస్తున్న గౌరీలంకేష్‌ వారపత్రికలో పలు కథనాలు ప్రచురించారు.

    ఘాటుగా స్పందించాడు

    ఘాటుగా స్పందించాడు

    ఈ క్రమంలోనే లంకేశ్ మృతిని ప్రస్తావిస్తే... ఏఆర్ రెహమాన్ కాస్తంత ఘాటుగా స్పందించాడు. గౌరీ లంకేశ్ హత్యను తీవ్రంగా ఖండించిన రెహమాన్... ఇలాంటి ఘటనలు జరిగితే... భారత్ తన దేశం కాదని ఆయన సంచలన ప్రకటన చేశాడు. తన తాజా చిత్రం "వన్ హార్ట్: ద ఏఆర్ రెహమాన్ కాన్ సర్ట్ ఫిల్మ్" స్పెషల్ ప్రీమియర్ కు హాజరైన సందర్భంగా రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    సంచలన వ్యాఖ్యలు

    సంచలన వ్యాఖ్యలు

    ప్రీమియర్ కు హాజరైన రెహమాన్ను చుట్టుముట్టిన మీడియా ప్రతినిధులు గౌరీ లంకేశ్ హత్యపై మీరేమంటారని ప్రశ్నించారట. దీంతో తన స్వరం సవరించుకున్న రెహమాన్ లంకేశ్ హత్యకు - దేశానికి - దేశ పౌరసత్వానికి ముడిపెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా రెహమాన్ ఏమన్నాడన్న విషయానికి వస్తే..

    భారత్ నా దేశం కాదు

    భారత్ నా దేశం కాదు

    "ఇలాంటి ఘటనలు భారత్ లో చోటుచేసుకోవు. అయితే ఇలాంటి ఘటనలు ఇక్కడ జరిగితే మాత్రం... నా భారత దేశం ఇది కాదు. ఈ ఘటన చాలా విచారకరం. నా దేశం మరింత సహనంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని రెహమాన్ అన్నారు. మరి ఈ వ్యాఖ్యలు ఎంతటి దుమారం లేపుతాయో చూడాలి.

    English summary
    A R Rahman has condemned the killing of Kannada journalist Gauri Lankesh and said, "I want India to be progressive and kind".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X