twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంద్రబాబు ఓడిపోయారు.. భువనేశ్వరి భాదపడలేదు!

    |

    స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు శుక్రవారం విడుదలయింది. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. పార్టీ స్థాపించిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం, దేశ రాజకీయాలని సైతం మలుపు తిప్పేలా అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం లాంటి విశేషాలు ఎన్టీఆర్ మహానాయకుడులో చూపించారు. ఈ చిత్రంలోని ఓ సన్నివేశం గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

     పార్టీ స్థాపించిన తర్వాత

    పార్టీ స్థాపించిన తర్వాత

    ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందే చంద్రబాబు నాయుడు ఆయనకు అల్లుడిగా మారారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ఎన్టీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు. ఎన్టీఆర్ ప్రభంజనంతో దేశరాజకీయాల్లో సైతం మార్పులు మొదలయ్యాయి. ఇలాంటి సన్నివేశాల్ని ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో చూపించారు. 1984 ఎన్నికలకు సంబంధించిన ఓ సన్నివేశం గురించి అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

    చంద్రబాబు ఓటమి

    చంద్రబాబు ఓటమి

    ఎన్టీఆర్ ప్రభంజనం ముందు కాంగ్రెస్ పార్టీలోనే హేమా హేమీలు సైతం నిలవలేకపోయారు. చంద్రబాబు అప్పుడప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్నారు. ఆ సమయంలో టిడిపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన బాబుకు సైతం ఓటమి తప్పలేదు. తన భర్త ఓడిపోయినప్పుడు సతీమణి భువనేశ్వరి ఎలా స్పందించారు అనే విషయాన్ని ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో చూపించినట్లు తెలుస్తోంది.

     బాధపడలేదు

    బాధపడలేదు

    ఏ భార్య అయినా తన భర్త విజయం సాధించాలని కోరుకుంటుంది. మహానాయకుడు చిత్రంలో కూడా భువనేశ్వరి పాత్రని క్రిష్ అలాగే చూపించారు. కానీ చంద్రబాబు ఓడిపోయిన తర్వాత ఆమె భాదపడినట్లు చూపించలేదు. ప్రజా తీర్పుని అంగీకరిస్తూ తన తండ్రి విజయాన్ని ఆస్వాదించినట్లు దర్శకుడు చూపించాడు. ఎప్పటికైనా తన భర్త విజయం సాధిస్తాడని ధీమాని కూడా భువనేశ్వరి పాత్రలో క్రిష్ చూపించినట్లు తెలుస్తోంది.

    నిరాశాజనకంగా

    నిరాశాజనకంగా

    ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం ఎన్టీఆర్ అభిమానులని అలరిస్తోంది కానీ వసూళ్లు నిరాశపరిచేలా నమోదవుతున్నాయి. తొలి రోజు ఎన్టీఆర్ మహానాయకుడు వసూళ్ళలో పెద్దగా జోరు కనిపించలేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వీకెండ్ ఇంకా ఉండడంతో రాబోవు రోజుల్లో ఈ చిత్రం ఏమేరకు వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

    English summary
    This is the Chandrababu's wife reaction when her husband lost in election
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X