ప్రభాస్ 'బాహుబలి' చేయడానికి బలమైన కారణం ఇదే.. డబ్బు, క్రేజ్ కాదు!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఇండియా మొత్తం క్రేజీ స్టార్. బాలీవుడ్ హీరోలని తలదన్నేలా ప్రభాస్ కు అభిమానులు ఏర్పడ్డారు. ఇదంతా బాహుబలి మహిమే. బాహుబలి 1, బాహుబలి 2 అద్భుతమైన విజయాన్ని సాధించాయి. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాటలో ప్రభాస్ తిరుగులేని నటన కనబరిచాడు. కానీ ఈ రెండు భాగాలూ పూర్తి కావడానికి దాదాపు ఐదేళ్ల సమయం పట్టింది. ఇంత సమయం వృధా చేసుకుని కూడా ప్రభాస్ బాహుబలి చిత్రంలో నటించడానికి బలమైన కారణం ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

 డబ్బు, క్రేజ్ కాదు

డబ్బు, క్రేజ్ కాదు

బాహుబలి చిత్రం తెరకెక్కించక ముందే దర్శక ధీరుడు రాజమౌళి సత్తా ఏంటో అందరికి తెలుసు. రాజమౌళి దర్శత్వంలో నటించాలని ప్రతి హీరో కోరుకుంటాడు. రాజమౌళి హీరోలని సిల్వర్ స్క్రీన్ పై ఎలా ప్రజెంట్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజమౌళి సినిమాలో నటిస్తే ఆ హీరో క్రేజ్ మరింతగా పెరుగుతుంది. బాహుబలి చిత్రానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనితో ప్రభాస్ కు భారీ మొత్తంలో పారితోషికం అందించారట. రాజమౌళి సినిమా, భారీ పారితోషికం లాంటి కారణాల వలన ప్రభాస్ ఈ చిత్రం చేయలేదు.

బలమైన కారణం

బలమైన కారణం

ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు 2010లో మరణించారు. అంతకు ముందే బాహుబలి చిత్రానికి ప్రభాస్ తో ఒప్పందం జరిగిపోయింది. కానీ బాహుబలి విడుదలయ్యే సమయానికి ఆయన లేరు. ప్రభాస్ ని రాజు పాత్రలో చూడాలని సూర్యనారాయణ రాజు బలంగా కోరుకునే వారట. బాహుబలితో ఆ అవకాశం రావడంతో వెంటనే అంగీకరించారు. తన తండ్రి కోరిక నెరవేర్చడం కోసమే ప్రభాస్ బాహుబలి చిత్రంలో నటించాడు.

సమయం ఎక్కువవుతున్నా

సమయం ఎక్కువవుతున్నా

ముందుగా బాహుబలి రెండు భాగాలని మూడేళ్లలో పూర్తి చేయాలనీ భావించారు. కానీ దాదాపు ఐదేళ్ల సమయం తీసుకుంది. టైం వేస్ట్ అవుతున్నా ప్రభాస్ మాత్రం మరో చిత్రానికి కమిట్ కాకుండా కేవలం బాహుబలిపైనే ఫోకస్ పెట్టాడు. బాహుబలి పూర్తయ్యాకే మరో చిత్రాన్ని ప్రారంభించాడు. ఇంత నిబద్దతతో ప్రభాస్ బాహుబలి చిత్రానికి పనిచేసింది తన తండ్రి కోరిక నెరవేర్చడం కోసమే అని తెలుస్తోంది.

సాహోతో బిజీగా

సాహోతో బిజీగా

ప్రభాస్ ప్రస్తుతం యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో సాహి చిత్రంలో నటిస్తున్నాడు. సాహో 200 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ యాక్షన్ హీరోగా దర్శనం ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రం తర్వాత రాధాకృష్ణ దర్శత్వంలో ఓ ప్రేమకథా చిత్రంలో నటించనున్నాడు. సాహో చిత్రం ఆగష్టు 15న విడుదలకు సిద్ధం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X