వైఎస్ఆర్‌కు చివరి ఎన్నికలు.. సినిమాలో అలా చూపించొద్దని జగన్ అన్నారు!

టాలీవుడ్ లో ప్రస్తుతం బయోపిక్ చిత్రాల హవా కొనసాగుతోంది. సినీ రాజకీయ సెలెబ్రిటీల బయోపిక్ చిత్రాలకు ప్రస్తుతం మంచి డిమాండ్ నెలకొని ఉంది. త్వరలో విడుదల కాబోతున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ చిత్రం యాత్ర అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. మహి వి రాఘవ్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిగ్గజ నటుడు మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్నాడు. టీజర్, ట్రైలర్స్ లో మమ్ముట్టి వైఎస్ఆర్ లాగే హావ భావాలు పాలిస్తున్నారు. ఈ చిత్రం గురించి తాజా ఇంటర్వ్యూలో మహి వి రాఘవ్ ఆసక్తికర విశేషాలు తెలియజేశారు.

వైఎస్ఆర్ జీవితంలో

వైఎస్ఆర్ జీవితంలో

కేవలం వైఎస్ఆర్ పాదయత్రని మాత్రమే కథ ఎంచుకోవడానికి గల కారణాలని చిత్ర దర్శకుడు మహి వి రాఘవ్ వివరించారు. వైఎస్ఆర్ జీవితంలో ఎన్నో గొప్ప సంఘటనలు ఉండొచ్చు. కానీ నాకు మాత్రం పాదయాత్రే సినిమా తీసేందుకు సరైన అంశంగా అనిపించింది. చిత్రానికి డ్రామాటిక్ గా నడిపించడానికి పాదయాత్రే కరెక్ట్ అని తాను నమ్మినట్లు మహి వి రాఘవ్ తెలిపారు.

వైఎస్ఆర్‌కు చివరి ఎన్నికలు

వైఎస్ఆర్‌కు చివరి ఎన్నికలు

సినిమా అంటే ఏదో ఒక సంఘర్షణతో కూడుకున్న అంశం ఉంటుంది. ఈ చిత్రంలో ప్రత్యేకంగా అంటూ సంఘర్షణ ఉండదు. 2004 లో వైఎస్ఆర్ ఎట్టిపరిస్థితుల్లో గెలవాలి. లేకుంటే అవే ఆయనకు చివరి ఎన్నికలు అయి ఉండేవి అనిచిత్ర దర్శకుడు తెలిపాడు. ఈ చిత్రానికి ఇదే పెద్ద సంఘర్షణతో కూడుకున్న అంశం అని తెలిపారు.

వైఎస్ఆర్ పథకాలు

వైఎస్ఆర్ పథకాలు

ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు, ముఖ్యమంత్రి అయ్యాక అమలు చేసిన పథకాలు అన్నింటి గురించి క్లుప్తంగా చూపించాం అని రాఘవ్ తెలిపారు. ఈ చిత్రంలో వైఎస్ఆర్ గురించి ప్రజలకు తెలియని కొన్ని అంశాలని చూపించడం జరిగిందని అన్నారు. కథ సిద్ధం చేయడం కోసం వైఎస్ఆర్ తో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులని, జర్నలిస్టులకి కలిసి అనేక విషయాలు తెలుసుకున్నానని అన్నారు.

 జగన్ చెప్పింది అదే

జగన్ చెప్పింది అదే

జగన్ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా కలసి ఈ చిత్రం గురించి చెప్పా. ఆయన ఒకటే మాట చెప్పారు. నా తండ్రి చేసినది చూపిస్తే చాలు. చేయని పనులు కూడా చేశాడని చూపించి క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని తనతో చెప్పినట్లు మహి వి రాఘవ్ అన్నారు. యాత్ర చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. జగపతి బాబు, సుహాసిని, అనసూయ, పోసాని కీలక పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X