»   » పాట పాడితే అక్కడికక్కడే ముద్దుపెట్టేసింది.... వైరల్ అయిన అనుష్క ముద్దు వీడియో

పాట పాడితే అక్కడికక్కడే ముద్దుపెట్టేసింది.... వైరల్ అయిన అనుష్క ముద్దు వీడియో

Posted By:
Subscribe to Filmibeat Telugu

అభిమానులు స్టార్ల కోసం చూడటం మామూలే అయితే కొన్నిన్ సార్లు స్టార్లు కూడా అభిమానులకే అభిమానులైపోతారు. అందులోనూ ఆ అభిమాని ముద్దొచ్చే చిన్నారి అయితే ఇంక ఎలా ఆగుతారు.? 'స్వచ్ఛభారత్ అభియాన్'కు సంబంధించి ప్రచార సన్నివేశాల చిత్రీకరణ నిమిత్తం బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మ ఇటీవల ఒక ప్రాంతానికి వెళ్లింది.

This Little Kid Girl Won Anushka Sharma Kiss By Singing

అనుష్కకు వీరాభిమాని అయిన ఓ చిన్నారికి ఈ విషయం తెలియడంతో షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లింది. అయితే, అనుష్కను కలిసేందుకు ఆ చిన్నారికి అనుమతి లభించలేదు. అయినప్పటికీ, దూరం నుంచి అనుష్కను చూస్తూ నిలబడి పోయింది. అయితే ఆ అమ్మాయి తనకోసం చూస్తున్న విషయం తెలుసుకున్న అనుష్క చిన్నారి ని దగ్గరకు పిలిపించుకుంది..

దీంతో ఆ చిన్నారి ఆనందంతో అనుష్కను చేరుకుంది. కాసేపు చిన్నారితో గడిపిన అనుష్క ఆ పాప సల్మాన్‌-అనుష్క జోడీగా నటించిన సుల్తాన్‌ సినిమాలోని 'జగ్‌ ఘూమెయా' పాట పాడి అనుష్కని మరింత ఆనందం లో ముంచెత్తింది . ముగ్ధురాలైన అనుష్క వెంటనే ఆ చిన్నారిని కౌగిలించుకుని బుగ్గపై ముద్దుపెట్టింది. మరీ అంత ఎక్సైటయితే ముద్దు పెట్టేస్తుందనే కాబోలు విరాట్ మరీ మరీ పక్కపక్కనే తిరుగుతూంటాడు. ఔనూ మరి సుల్తాన్ లో సల్మాన్ పాట పాడ లేదనేనా అంతగా లిప్ లాక్ చేయనంటే చేయనని భీష్మించుక్కూచుంది...

English summary
Anushka Sharma Got Mad After Listening little girl Singing JAG GHUMEYA on The Set
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu