ఆ మూడు రోజులూ...ఈ నాలుగు రిలీజులు
సంక్రాంతి మూడు రోజులు నాలుగు చిత్రాలు రిలీజవుతూ ప్రేక్షకులుకు విందు చేయనున్నాయి.వాటిల్లో మొదట జనవరి 12వ తేదీన బాలకృష్ణ, దాసరి కాంబినేషన్ లో రెడీ అయిన పరమ వీర చక్ర విడుదల అవుతుంది. సింహా చిత్రం అనంతంరం వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.అదే రోజు సుమంత్ తాజా చిత్రం గోల్కొండ హైస్కూల్ విడుదల కానుంది. కలర్స్ స్వాతి హీరోయిన్ గా చేసిన ఈ చిత్రాన్ని అష్టా చెమ్మ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందించారు. క్రికెట్ ఆట నేఫద్యంలో రూపొందే ఈ చిత్రాన్ని సురేష్ బాబు సమర్పిస్తున్నారు.
ఇక పండుగ రెండో రోజైన జనవరి 13న ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందిన రవితేజ...మిరపకాయ చిత్రం విడుదల అవుతుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాటలు ఇప్పటికే అంతటా మారు మ్రోగుతున్నాయి. మూడో రోజు...సిద్దార్ధ, శృతిహాసన్ కాంబినేషన్ లో రాఘవేంద్రరావు కుమారుడు సూర్య ప్రకాష్ డైరక్ట్ చేసిన అనగనగా ఒక ధీరుడు చిత్రం విడుదల కానుంది. మంచు లక్ష్మీప్రసన్న విలన్ గా నటించి ఈ చిత్రం ఓ ఫాంటసీ. డిస్నీ సంస్ధ నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్స్ విడదల తోటే అంతటా మంచి అంచనాలు రేపింది. ఇలా ఈ నాలుగు చిత్రాలు ఈ సంక్రాంతికి పోటీపడనున్నాయి. వీటిల్లో గెలపు ఎవరదనేది చూడాలి.


Click it and Unblock the Notifications











