twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీవితాలతో ఆడుకుంటున్నారు, వారిని వదలొద్దు: పోలీసులకు అనసూయ రిక్వెస్ట్

    By Bojja Kumar
    |

    Recommended Video

    Anchor Anasuya Talks About Traffic Rules

    యాంకర్ అనసూయ ట్విట్టర్లో చేసిన ఓ పోస్ట్ హాట్ టాపిక్ అయింది. రోడ్డుపై వాహనాలు నడిపే కొందరు వ్యక్తులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వివరిస్తూ ఆమె చేసిన ఈ పోస్ట్ అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. దానికి ఇందులో ఎక్కువ శాతం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నవే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌‌ రోడ్లపై ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ అనసూయ దృష్టిలో పడ్డారు. దీన్ని తన ఫోన్లో రికార్డు చేసిన ఆమె హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు. ఈ క్రమంలో కొందరు ఆమెతో వాదనకు దిగారు.

    వీడియోలు చూస్తూ కారు నడుపుతున్న వ్యక్తి

    వీడియోలు చూస్తూ కారు నడుపుతున్న వ్యక్తి

    బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఓ వ్యక్తి వీడియోలు చూస్తూ కారు నడుపుతూ అనసూయ కంట పడ్డాడు. దీన్ని ఆమె తన ఫోన్లో వీడియో రికార్డ్ చేసి ట్విట్టర్లో పోస్టు చేశారు.

    ఇలాంటి వారిని వదలొద్దు సార్

    ఇలాంటి వారిని వదలొద్దు సార్

    ఇలా నిర్లక్ష్యంగా కారు నడపటం వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీరి మూలంగా ఏ తప్పూ చేయని వారు ప్రమాదాల బారిన పడుతున్నారు. నేను కూడా గతంలో ఇలా నిర్లక్ష్యం కారణంగానే యాక్సిడెంట్ ఫేస్ చేశాను. ఇలాంటి వారిని వదలొద్దు సార్ అంటూ... అనసూయ ట్వీట్ చేశారు.

     గతంలో పెద్ద యాక్సిడెంట్ నుండి తప్పించుకున్న అనసూయ ఫ్యామిలీ

    గతంలో పెద్ద యాక్సిడెంట్ నుండి తప్పించుకున్న అనసూయ ఫ్యామిలీ

    గతంలో ఓ పెద్ద యాక్సిడెంట్‌ నుండి అనసూయ, ఆమె ఫ్యామిలీ అదృష్టవశాత్తు చిన్న గాయాలతో బయట పడ్డ సంగతి తెలిసిందే. బెంగులూరు వెళుతుండగా వారి కారు బోల్తాపడింది. ఎదురుగా కారు నడుపుకుంటూ వస్తున్న వ్యక్తి మద్యం సేవించి డ్రైవ్ చేయడమే అప్పట్లో ఆ ప్రమాదానికి కారణమైనట్లు వార్తలు వచ్చాయి. సమయానికి కార్లోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో అనసూయతో పాటు ఆమె భర్త, పిల్లలు సురక్షితంగా బయట పడ్డారు.

    పోలీసులు ఎలా స్పందిస్తారో?

    ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ఫోన్ మాట్లాడుతూ.... వీడియోలు చూస్తూ వాహనాలు నడుపవద్దని ఎంత చెప్పినా చాలా మంది పట్టించుకోవడం లేదు. ఇలాంటి చిన్న పాటి నిర్లక్ష్యాలే ఒక్కోసారి పెద్ద ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. అనసూయ ట్వీట్ మీద హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

    నేను కారు డ్రైవ్ చేయడం లేదు

    అనసూయ ట్వీట్‌పై కొందరు రియాక్ట్ అవుతూ... మీరు కారు డ్రైవర్ చేస్తూ ఈ వీడియో రికార్డ్ చేయలేదు కదా? అని ప్రశ్నించగా తనకు డ్రైవింగ్ రాదని అనసూయ తెలిపారు.

    బంజారా హిల్స్ రోడ్ నెం.2లో..

    బంజారాహిల్స్ రోడ్ నెం.2లో పార్క్ హయత్ హోటల్ సమీపంలో తాను ఈ దృశ్యాన్ని రికార్డ్ చేసినట్లు అనసూయ తెలిపారు.

    అప్పుడే పెద్ద గొడవ చేశారు

    ఈ వీడియో తీసే బదులు ఒక్క నిమిషం దిగి చెప్పొచ్చుకదా అని ఒకరు వ్యాఖ్యానించగా... అనసూయ బదులిస్తూ ‘అలా చిన్నపిల్లాడికి ఫోన్ ఇచ్చి 2 వీలర్ మీద వెనకాల తిరిగి కూర్చోబెట్టి బండి నడుపుతూ వీడియో తీయొద్దు అని చెప్పినందుకే చాలా పెద్ద కథ నడిపించారు సార్. మేము కెమెరా ముందే నటులం, లేక పోతే మీ లాంటి జనాలమేనండి. గుర్తించండి సార్' అంటూ వ్యాఖ్యానించింది.

    అనసూయతో వాదన

    అతడి తప్పేమీ లేదంటూ అనసూయతో మరొకరు వాదనకు దిగారు. జనాలు నోటీస్ చేయడానికే నువ్వు ఇలా చేస్తున్నావంటూ అనడంతో అనసూయ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు.

    వాళ్లను జడ్జ్ చేస్తున్నారా?

    క్యాబ్ డ్రైవర్లు రూట్ మ్యాప్, లొకేషన్ కోసం ఫోన్ చూస్తూ ఉంటారు. మీరు వారు తప్పు చేశారని ఎలా జడ్జ్ చేస్తారు? అంటూ అనసూయతో వాదనకు దిగడం గమనార్హం.

    English summary
    "Dear HYDTP This scares the life out of me sir.. I already faced an accident because of someone else’s fault.. please do not let such careless drivers get away with doing anything they want to.. they do not have right on the lives of everyone else on the road..please sir" Anasuya tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X