twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈవారం సినివారం: ప్రభకర రెడ్డి జయంతి సభ, దేవదాసు సినిమా ప్రదర్శన

    భాషా సాంస్కృతిక శాఖ - తెలంగాణ ప్రభుత్వం ఆద్వర్యంలో నిర్వహిస్తున్న సినివారం లో తెలంగాణా సీనియర్ నటుడు, రచయిత, దర్శకుడూ ప్రభాకర్ రెడ్డి జయంతి సభ ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటర్జీ జయంతి సభ.

    |

    ఆ ఇద్దరూ మనకు లేరు కానీ వారి కథ ఉంది, కళ ఉంది, వాళ్ళు మనకోసం ఇచ్చిన సినిమా ఉంది. తెలుగు వారైన ప్రభాకర రెడ్డీ, బెంగాలీ వారైన శరత్ చంద్ర చటర్జీ ఇద్దరూ తెలుగు సినీ పరిశ్రమకి చేసిన సహకారం, ప్రత్యక్షంగానో పరోక్షంగానో తక్కువేమీ కాదు,

    ప్రభకర్ రెడ్డి జయంతీ శరత్ నవల దేవదాసు ఆవిష్కరణ ఒకే తేదీన జరిగాయి.ఆ సంధర్భాన్ని పురస్కరించుకోని భాషా సాంస్కృతిక శాఖ - తెలంగాణ ప్రభుత్వం ఆద్వర్యంలో నిర్వహిస్తున్న సినివారం లో ఈ రోజు భారతీయ సాహిత్య రంగం లో 16 సార్లు సినిమా గా తెకెక్కిన దేవదాసు నవల వందేళ్లు పూర్తయిన సందర్భంగా రచయత శరత్‌ చంద్ర ఛటర్జీ (బెంగాలీ) గారి స్మరణ సభ, విలన్‌గా, క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా,పాత్రలకు ప్రాణంపోసి .. నిర్మాతగా, దర్శకుడిగా, చిత్ర కథారచయితగా అశేష తెలుగు ప్రేక్షకుల విశేషాభిమానాన్ని పొంది సినీ పరిశ్రమ కళాకారుల సంక్షేమం కోసం పోరాడిన నటుడు తెలంగాణ బిడ్డ డాక్టర్ యం.ప్రభాకర్‌రెడ్డి జయంతి సభ నిర్వహించబడుతోంది, ఈ కార్యక్రమంలో సినివారం టీమ్ నరేందర్ గౌడ్, అక్షరకుమార్, ఎమ్మెస్ విష్ణు, కట్టా శివ, మహేష్ బాబు సమర్థవంతంగా ఏర్పాట్లని చెసారనీ, ప్రవేశం అందరికీ ఉచితమనీ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.

     ప్రభాకర్‌రెడ్డి

    ప్రభాకర్‌రెడ్డి

    సుమారు 470 చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన ప్రభాకర్‌రెడ్డి విలన్‌గానే కాకుండా, మంచి నటుడిగా రాణించారు. నాటకాల్లో ఉన్న అనుభవం ఆయనకు సినిమాల్లో బాగా ఉపయోగపడింది. తన పాత్ర ఎలాంటిదైనా దానిని రక్తి కట్టించేవారు.ప్రభాకర్‌రెడ్డి నిర్మాతగా రూపొందిన చిత్రాలు పచ్చని సంసారం, పం డంటి కాపురం, గాంధీ పుట్టిన దేశం, మాకు స్వతంత్రం వచ్చింది, ధర్మాత్ముడు, గృహప్రవేశం, కార్తీక దీపం ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. చక్కటి కుటుంబ కథా చిత్రాలను నిర్మించి అన్నివర్గాల ప్రేక్షకులకూ ఆయన చేరువయ్యారు.మండలాధీశుడు, గండిపేట రహస్యం, ప్రతిభావంతుడు, ప్రచండ భారతం, కామ్రేడ్ చిత్రాలకు ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. సుమారు 21 చిత్రాలకు ఆయన కథలు సమకూర్చారు.

    జాతీయ ఉత్తమ చిత్రం

    జాతీయ ఉత్తమ చిత్రం

    పల్నాటి యుద్ధంలో కన్నమదాసుగా గొప్పగా నటించారు. మహామంత్రి తిమ్మరుసు, బొబ్బిలియుద్ధం, అల్లూరి సీతారామరాజు వంటి చారిత్రక చిత్రాల్లోనూ నటుడిగా తన ప్రతిభ చూపారు.తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఏది తలపెట్టినా ప్రభాకర్‌రెడ్డి పట్టుదలతో కృషిచేసి అందుకు నిరంతరం శ్రమించేవారు. ఇందుకు నిదర్శనమే ఆయన చిత్రం పండంటి కాపురం జాతీయ ఉత్తమ చిత్రంగా ఎం పికైంది.

    మోహన్‌బాబును హీరోగా చేసి

    మోహన్‌బాబును హీరోగా చేసి

    దుష్టపాత్రలే కాకుండా తండ్రిగా, మామగా, అన్నగా, తాతగా విభిన్న పాత్రలను ఆయన రక్తికట్టించారు. రణభేరి వంటి జానపద చిత్రాల్లోనూ నటించారు. విలన్ పాత్రలతో కాలం గడుపుతున్న మోహన్‌బాబును హీరోగా చేసి ప్రేక్షకుల్లో గుర్తింపుపొందా రు. తన గృహ ప్రవేశం చిత్రం ద్వారా మోహన్‌బాబును హీరోగా పరిచయం చేశారు.

    దేవదాసు సినిమా

    దేవదాసు సినిమా

    ప్రభాకర్‌రెడ్డి జయంతి సభ అనంతరం ఇరవయ్యవ శతాబ్ధపు ప్రముఖ బెంగాలీ నవలా రచయిత జయంతి సందర్భంగా ఆయన రచన అయిన దేవదాసు సినిమా స్క్రీనింగ్ జరగనుంది. శరత్ చంద్ర బెంగాలీ రచయిత. ఆయన నవలలు తెలుగునాట ప్రభంజనంలా ప్రాచుర్యం పొందాయి. సమాజాన్ని, వ్యక్తినీ లోతుగా అధ్యయనం చేసి సృష్టించిన ఆయన పాత్రలు, నవలలు చిరస్థాయిగా నిలిచిపోయాయి.

     దేవదాసు

    దేవదాసు

    తెలుగునాట నవలగా, చలన చిత్రంగా సంచలనం సృష్టించిన దేవదాసు ఆయన నవలే. చక్రపాణి మొదలైన అనువాదకులు ఆయనను తెలుగు వారికి మరింత దగ్గర చేసారు. ఆయన రచనల ఆధారంగా దాదాపు 50 సినిమాలు వివిధ భారతీయ భాషల్లో నిర్మించబడ్డాయి. ప్రత్యేకించి దేవదాసు 16సార్లు , పరిణీత రెండు సార్లు నిర్మించబడ్డాయి.

    తోడికోడళ్ళు

    తోడికోడళ్ళు

    హృషికేష్ ముఖర్జీ 'మజ్లి దీదీ' (1967), 'బిందుగారబ్బాయీ ఆధారంగా 'ఛోటీ బహూ' (1971), 'స్వామి' (1977), నిష్కృతి ఆధారంగా హిందీలో బసు ఛటర్జీ 'అప్నే పరాయే' (1980), తెలుగులో 'తోడికోడళ్ళు' నిర్మించబడ్డాయి. గుల్జార్ చిత్రం 'ఖుష్బూ ' (1975) కు 'పండితమహాశయుడు ' ప్రేరణ. ఆచార్య ఆత్రేయ సినిమా వాగ్దానం (1961) ఆయన కథ ఆధారంగా తీసిందే.

    English summary
    Devdas movie screening and birt anniversery meeting of telugu actor, writer em.prabhakar reddy and popular Bengali Writer Shart chandra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X